జ్యోతిష్యం & వాస్తు

Birth Marks : పుట్టు మ‌చ్చ‌లు శ‌రీరంపై ఎక్క‌డ ఉంటే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

Birth Marks : ఒక మనిషికి, మరో మనిషికి మధ్య తేడా ఏముంటుంది..? రంగు, ఎత్తు, బరువు, ఆకారం.. ఇలా వివిధ రకాలైన అంశాల్లో తేడాలుంటాయి. దీంతోపాటు వేలిముద్రలు కూడా ఏ ఇద్దరికీ ఒకే రకంగా ఉండవు. ప్రతి మనిషికి ఇవి వేర్వేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఇంకోటి కూడా ఉంది. అదే పుట్టుమచ్చ. వేలిముద్రల్లాగే ఇవి కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. వీటి ప్రకారమే ఆయా సర్టిఫికెట్లలో ధ్రువీకరణ కోసం ఒంటి మీద ఉన్న పుట్టు మచ్చలను గురించిన వివరాలను సేకరిస్తారు. అయితే అసలు ఈ పుట్టుమచ్చలు ఎలా ఏర్పడతాయి..? తెలుసుకుందాం రండి.

మన చర్మం రంగుకు మెలనిన్ అనే ఓ రకమైన కెమికల్ కారణమవుతుందన్న విషయం తెలిసిందే. ఇది చర్మంపై పడే సూర్యకాంతిలోని హానికారక అతి నీలలోహిత కిరణాలను గ్రహించి మనల్ని రక్షిస్తుంది. అయితే మన శరీరంలో ఉండే మెలనోసైట్ అనే కొన్ని ప్రత్యేక కణాలు ఈ మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో మెలనిన్ చర్మం అంతటా ప్రవాహం అవుతుంది. తద్వారా బయటి చర్మం వైపు వచ్చి అక్కడి రంగుకు కారణమవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మెలనోసైట్ కణాలు కలసికట్టుగా పనిచేయడం వల్ల మెలనిన్ మరింత దట్టంగా ఏర్పడి ఒకే చోట మచ్చగా లేదా చుక్కగా కనిపిస్తుంది. అదే పుట్టుమచ్చగా మనకు దర్శనమిస్తుంది.

Birth Marks

పుట్టుమచ్చలు కొంత మందికి తల్లి కడుపులో ఉండగానే ఏర్పడతాయి. మరికొందరికి పుట్టుక అనంతరం, ఇంకొందరికి యుక్త వయస్సులో అలా దాదాపు 20 ఏళ్లు వచ్చే వరకు ఎక్కడో ఒక చోట పుట్టు మచ్చలు ఏర్పడుతూనే ఉంటాయి. ఈ పుట్టుమచ్చలు సాధారణంగా నలుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి. అప్పుడప్పుడు పసుపు రంగుకు మారుతుంటాయి. ఒక్కోసారి సరిగ్గా కనిపించవు కూడా. శరీర ఆరోగ్య స్థితిని బట్టి కూడా ఇవి రంగులో మార్పును చూపెడుతుంటాయి.

నలుపు రంగు శరీరం కలవారి కంటే తెలుపు రంగు శరీరం కలవారికి పుట్టుమచ్చలు ఎక్కువగా ఉంటాయట. ఆకుపచ్చ, ఎరుపు రంగులో కూడిన పుట్టు మచ్చలు ఉన్న వారికి శుభాలు కలుగుతాయట. నలుపు రంగువి అశుభం కలిగిస్తాయట. లేత నలుపు, ఆకుపచ్చ, గంధపు రంగులను పోలిన మచ్చలు ఉన్నా కూడా శుభ ఫలితాలే కలుగుతాయట. పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉన్న వారు ధనవంతులు, కీర్తివంతులు అవుతారట. పురుషులకు రెండు కనుబొమల మధ్య పుట్టుమచ్చలు ఉంటే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడు. బంధుప్రియుడవుతాడు. భోగములందు ఆసక్తి కలిగి ఉంటాడు. సువాసన ద్రవ్యముల పట్ల ప్రేమకలిగి వుంటాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

తలలో పుట్టుమచ్చలు కలిగిన పురుషునికి గర్వము ఎక్కువ. వారు ప్రతి అంశాన్ని విమర్శనాత్మకంగా గమనిస్తారు. మంచి ఆశాభావం గలవారు, రాజకీయ, సామాజిక అంశాలలో మంచి శ్రద్ధ‌ కలిగి ఉంటారు. నుదుటి మీద ఉంటే మంచి కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు. ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. రాజకీయాల్లో రాణిస్తారు. నుదుటి కింది భాగంలో ఉంటే మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు. 40 ఏళ్ల తర్వాత విజయం సాధిస్తారు. కనుబొమ్మపై ఉంటే కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈర్ష్య ఉండదు. ముక్కుపై ఉంటే కొంత మందిలో క్రమశిక్షణ లోపిస్తుంది. చెవికి చెందిన ఏ భాగములో ఉన్నా ధనం కనిపిస్తూ ఉంటుంది. సమాజంలో గౌరవంతో కూడిన గుర్తింపు ఉంటుంది.

పెదవిపై ఉంటే కొన్నిసార్లు మీ బంధువులు, స్నేహితుల విషయంలో మీకు ఈర్ష్య కలుగుతుంది. బుగ్గపై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు. స్థిరాస్తులు గడిస్తారు. నాలుకపై ఉంటే మీరు మంచి తెలివితేటలు, విద్యను కలిగి ఉంటారు. గడ్డంపై ఉంటే ఆడ, మగ వారిలో భిన్నంగా ఫలితాలు ఉంటాయి. గడ్డం మధ్యలో పుట్టు మ‌చ్చ ఉన్న మగవారు ఉదారగుణము కలిగి ఉంటారు. ఆడ వారికి భక్తిభావం మెండు. మంచి అదృష్టవంతులవుతారు. భుజంపై ఉంటే మర్యాదస్తులుగా ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఆనందకరమైన దాంపత్య జీవితం కొనసాగిస్తారు. మోచేయిపై ఉంటే మీ జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు.

ఎడమ చంక భాగంలో ఉంటే మీ ప్రారంభ జీవితంలో కొంత ఒడిదుడుకులున్నా తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి. కుడి చంక భాగంలో ఉంటే భద్రత విషయంలో మీరు చాలా మెళకువగా ఉంటారు. మెడ భాగంలో ఉంటే కొన్ని సమయాల్లో మీకు దురదృష్టం తప్పదు. ఇతరులు మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తారు. నుదుటి పై భాగమునందు పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు అహంకారము ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించగలరు. జ్ఞానవంతురాలు, కళలయందు ఆసక్తి ఎక్కువగా ఉండటమేగాక ర‌చనలు చేయడం, పత్రికా రంగంలో ఉన్నత రచయత్రి అయ్యే అవకాశం ఉంటుంది.

కుడి కనుబొమ మీద మచ్చ ఉన్నవారికి వివాహము త్వరిత గతిన అవుతుంది. కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే సంపదలను కలిగి ఉంటాడు. వాహన సౌఖ్యము లభిస్తుంది. మొత్తమ్మీద ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగా ఉంటారు. ఎడమవైపు పుట్టుమచ్చలు ఉంటే ఫలితాలు మిశ్రమముగా ఉంటాయి. శరీరం ముందు భాగంలో ఉంటే ఆకస్మిక ధన లాభం. శరీరం వెనుక భాగంలో ఉంటే వీరు కష్టపడి పని చేసినా ఆ పేరు ఇతరులకు దక్కుతుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM