మనం ఎన్ని వంటకాలు చేసిన అందులో కొన్ని వంటకాలు లేకపోతే ఆ వంటకాలు రుచి ఉండదు. అలాంటి వాటిలో ఆంధ్ర స్పెషల్ కంది పప్పు పొడి ఒకటి అని చెప్పవచ్చు. తినడానికి ఎంతో రుచిగా ఉండే కంది పప్పు పొడిని ఒక్కసారి తింటే మరీ మరీ తినాలనిపిస్తుంది. మరి ఈ రుచికరమైన కంది పప్పు పొడి ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*కందిపప్పు కప్పు
*పప్పులు ఒక కప్పు
*ఎండు మిరపకాయలు 10
*వెల్లుల్లి రెబ్బలు 15
*కరివేపాకు సరిపడేంత
*ఇంగువ అర టీ స్పూన్
*జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు
*మెంతులు అర టీ స్పూన్
తయారీ విధానం
ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి కందిపప్పును, ఆ తర్వాత పప్పులను దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా కందిపప్పును వేయించుకున్న తరువాత అదే బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించుకోవాలి.బాగా వీటిని వేయించుకున్న తరువాత మిక్సీ గిన్నెలో వేసి తగినంత ఉప్పు ఇంగువ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి ముందుగా వేయించి పెట్టుకున్న కందిపప్పు, పప్పులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన కంది పప్పు పొడిని మనం ఇడ్లీ నుంచి మొదలుకొని ఉప్మా, ఉగ్గాని, బజ్జీలు వంటి వాటిలోకి తినడమే కాకుండా, వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి కలుపుకుని తింటే ఆ రుచి వర్ణించలేనిది అని చెప్పవచ్చు.