---Advertisement---

రుచికరమైన యాపిల్ బర్ఫీ తయారు చేయండిలా

June 30, 2021 1:20 PM
---Advertisement---

ఎంతో రుచికరమైన యాపిల్ బర్ఫీ తినడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ
యాపిల్ బర్ఫీ తినడానికి ఇష్టపడుతుంటారు. ఇంకెందుకు ఆలస్యం రుచికరమైన యాపిల్ బర్ఫీ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

*యాపిల్స్ 2

*జీడిపప్పు పావు కప్పు

*పంచదార అర కప్పు

*చిక్కటి పాలు మూడు కప్పులు

*కొబ్బరి పొడి అర కప్పు

*ఏలకుల పొడి అర టీ స్పూన్

తయారీ విధానం

ముందుగా జీడిపప్పులను నానబెట్టుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా యాపిల్ పై తోలు తీసి అందులో గింజలు లేకుండా మెత్తని గుజ్జులా తయారు చేసి పెట్టుకోవాలి.తరువాత స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి చిన్నమంటపై పాలను బాగా కలియబెడుతూ ఉడికించాలి. ఈ విధంగా పాలు బాగా మరుగుతున్న సమయంలో ముందుగా తయారు చేసి పెట్టుకొన్న ఆపిల్ గుజ్జు, జీడిపప్పు మిశ్రమం, కొబ్బరి పొడి వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా దగ్గర పడే సమయంలో ఇందులో చక్కెర పొడి, యాలకల పొడి వేసి కలియబెట్టుకోవాలి. ఈ విధంగా రెండు నిమిషాలు కలిపిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ లోకి నెయ్యి పోసి మిశ్రమం మొత్తం అందులోకి వేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మనకు ఏవిధంగా నచ్చితే ఆ విధమైన ఆకారంలో కట్ చేసుకొని తినవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now