ఆయుర్వేదంలో పటికకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. దీంతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అయితే వాస్తు పరంగా కూడా పటికకు ప్రాధాన్యం ఉంది. దీన్ని పలు చోట్లలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు పోతాయి.
సాధారణంగా చాలా మందికి సమస్యలు వస్తుంటాయి. కొన్ని సమస్యలు అయితే వాస్తు దోషాల వల్లే ఏర్పడుతుంటాయి. అలాంటి వారు 50 గ్రాముల పటికను ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఉత్తర దిశలో ఉంచాలి. దీంతో వాస్తు దోషం పోతుంది. సమస్యల నుంచి బయట పడతారు.
ఇంట్లో సంతోషం అస్సలు లేని వారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఈ విధంగా పటికను ఇంట్లో ఉంచడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ధనం సిద్ధిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు.