వేసవికాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో మనకి మామిడి పండ్లు దర్శనమిస్తాయి. రకరకాల జాతులకు చెందిన మామిడిపండ్లను తినడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు.అయితే ప్రస్తుత కాలంలో ఈ మామిడిపండ్లు సహజసిద్ధంగా పండిన దానికన్నా కార్బైడ్ ద్వారా అధికంగా పండిస్తున్నారు. ఈ విధంగా రసాయనాల ద్వారా పండించిన మామిడి పండ్లను తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కార్బైడ్ ద్వారా పండించిన మామిడి పండ్లు, సహజసిద్ధంగా పండించిన మామిడి పండ్లను ఏ విధంగా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం..
సహజసిద్ధంగా పండిన మామిడి పండు మొత్తం ఒకే రంగులో ఉంటుంది. అదేవిధంగా కాయ తొడిమ దగ్గర మంచి సువాసన ఉంటుంది.సహజసిద్ధంగా పండిన మామిడి పండ్లు తాకగానే ఎంతో మెత్తగా ఉండి అధిక రసం కలిగి ఉంటాయి. ఇవి తినడానికి ఎంతో రుచిని కలిగి ఉంటాయి.
కార్బైడ్ ద్వారా పండించిన మామిడి పండ్లు అక్కడక్కడ పసుపు, ఆకుపచ్చ రంగులను కలిగి ఉంటాయి. ఈ పండ్లను తాకగానే గట్టిగా ఉండడంతో పాటు తొడిమ దగ్గర పులుపు వాసనను కలిగి ఉంటాయి. ఈ విధంగా పండించిన మామిడి పండ్లను తినడం వల్ల పులుపు రుచి ఉంటుంది. కార్బైడ్ ఉపయోగించిన మామిడి పండ్లను నీటిలో వేస్తే పైకి తేలుతాయి. ఈ విధంగా సద సిద్దంగా పండిన మామిడి పండ్లను, కార్బైడ్ ద్వారా పండించిన మామిడి పండ్లను సులభంగా గుర్తించవచ్చు.