---Advertisement---

నర్సింగ్ యాదవ్ కొడుకుని చూడగానే చిరంజీవి ఫీలింగ్స్.. బయటపెట్టిన నర్సింగ్ భార్య !

April 23, 2021 1:09 PM
---Advertisement---

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎన్నో సినిమాలలో నటించిన నర్సింగ్ యాదవ్ అందరికీ బాగా పరిచయమే. సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి నర్సింగ్ యాదవ్ తో ప్రత్యేక అనుబంధం ఉండేది. అయితే గత ఏడాది డిసెంబర్ 31న అనారోగ్య సమస్యల వల్ల నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఈయన ఆకస్మిక మరణం టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నింపింది.

ముఖ్యంగా నర్సింగ్ యాదవ్ తో ఎంతో అనుబంధం ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా బాధ పడ్డారు. మెగాస్టార్ సినిమా తీస్తున్నారంటే ఆ సినిమాలో కచ్చితంగా నర్సింగ్ యాదవ్ ఉండాల్సిందే.చిరంజీవి కన్నా ముందుగా సెట్ కి వెళ్లి అక్కడ పనులను సమకూర్చేవారు అంటూ తాజాగా నర్సింగ్ యాదవ్ భార్య చిత్ర ఓ సందర్భంలో తెలియజేశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్ర మెగా కుటుంబంతో నర్సింగ్ యాదవ్ కి ఉన్న అనుబంధం గురించి తెలియజేసింది. తన కొడుకు పుట్టినప్పుడు బాబుని తీసుకొని చిరంజీవి గారిని కలవడానికి వెళ్ళాము. అప్పుడు చిరంజీవి బాబును చూడగానే ఎంతో సంతోషించారు.ఆ సమయంలో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన మేనేజర్ ని పిలిపించి ఒక గోల్డ్ చైన్ తెప్పించి బాబుకు బహుమతిగా ఇచ్చారు. దాదాపు ఏడు తులాల బరువున్న గోల్డ్ చైన్ చిరంజీవి గారు తన బాబు మెడలో వేశారని చిత్ర మెగా కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి తెలియజేసింది

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now