ప్రస్తుత కాలంలో మనం ఉపయోగించే వంటలలో ఎక్కువ భాగం చక్కెరను ఉపయోగిస్తున్నాము. ఈ క్రమంలోనే ఎన్నో ప్రయోజనాలు కలిగిన బెల్లం పక్కన పెట్టడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన బెల్లం ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
*బెల్లంలో మనకు ఎక్కువగా ఐరన్, పొటాషియం, సోడియం, క్యాల్షియం, మాంగనీస్ వంటి పోషకాలు ఎక్కువ భాగం లభిస్తాయి. మన శరీరంలో అధిక రక్తపోటు సమస్యను తగ్గించడమే కాకుండా రక్తం వృద్ధి చెందడానికి దోహదపడుతుంది.
*ఆస్తమా బ్రాంకైటిస్ వంటి జబ్బులతో బాధపడేవారు క్రమం తప్పకుండా బెల్లాన్ని నువ్వులతోపాటు కలిపి తినటం వల్ల ఈ విధమైనటువంటి ఆస్తమా బ్రాంకైటిస్ వంటి సమస్యలు నుంచి విముక్తి పొందవచ్చు.
*అజీర్ణ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత కాస్త బెల్లం ముక్క తినడం ద్వారా జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి.
*అధిక శరీర బరువు పెరిగే వారు శరీర బరువును నియంత్రించుకోవడం కోసం బెల్లం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు 100 గ్రాముల బెల్లం చొప్పున తీసుకోవటంవల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు.
*సాధారణంగా వయసు పైబడే కొద్దీ చాలామంది ఎదుర్కొనే సమస్యలలో కీళ్లనొప్పి సమస్య ఒకటి. ఈ విధంగా కీళ్లనొప్పులతో బాధపడేవారు బెల్లం ముక్కతో పాటు కాస్త అల్లం కలిపి తినటం వల్ల తొందరగా ఈ విధమైనటువంటి నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు.
*ప్రతిరోజు మనం పాలలోకి చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవటం వల్ల ఎముకలు దృఢంగా తయారవడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా మహిళలలో వచ్చే నెలసరి సమస్యలు కూడా తగ్గుతాయి.