సాధారణంగా కాలాలకు అనుగుణంగా లభించే పండ్లలో పనస ఒకటి. పనస పండ్లు తినడానికి ఎంతో రుచి కలిగి ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవారి వరకు పనస పండ్లు తినడానికి ఎంతో ఇష్టం చూపుతుంటారు. అయితే పనసపండులో ఎక్కువగా పీచు పదార్థాలు, విటమిన్లు, వంటి పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే మనం చిన్నప్పుడు పనసపండును తిన్న తర్వాత పనస గింజలను కాల్చుకుని తినడం చేస్తుంటాము. నిజానికి పనసపండులో కన్నా గింజలలో అధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.మరి పనసపండు గింజలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
*పనస పండు గింజలలో ఉన్నటువంటి లెక్టిన్లు రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరిచి ఎటువంటి అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
*ఈ పనస పండు గింజలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తాయి.ఈ విధమైనటువంటి విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి చేరటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, కంటిచూపు సమస్యలను దూరం చేస్తుంది.
*పనస గింజలలో ఉన్నటువంటి పొటాషియం మధుమేహాన్ని గుండె జబ్బులను దూరం చేస్తుంది. అలాగే పనసలో ఉన్నటువంటి ఐరన్ రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది.
*పనసలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను తొలగించి, మలబద్దకాన్ని నివారిస్తుంది. ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ పనస గింజలను కొందరు కూరలా తయారు చేసుకొని తింటారు. మరి కొందరు వీటిని వేయించుకుని ఉప్పు కారం వేసి స్నాక్స్ మాదిరిగా తింటారు. ఈ విధంగా పనస గింజలను తినడం వల్ల పై తెలిపిన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.