ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్తను తెలియజేశారు. ఈ ఏడాది మొత్తం ప్రతి నెల వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని గత నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెలలో 1238 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.ఇందులో భాగంగా 1238 ఎస్సీ, ఎస్టీ, డీఏ బ్యాక్ లాగ్ ఉద్యోగాలను ఈ నెలలో భర్తీ చేయాల్సి ఉంది.
రాష్ట్రంలోని 802 ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సర్కార్ యూనివర్సిటీలు, నియామక సంస్థలు, వివిధ విభాగాధిపతిలకు ప్రభుత్వం అనుమతులను జారీ చేసింది. ఈ క్రమంలోనే విద్యార్హతలలో అభ్యర్థులు సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయాలని ప్రభుత్వం తెలిపింది.
ఈ విధమైనటువంటి ఎంపిక విధానం ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే పరీక్షలకు వర్తించదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం విడుదల చేసిన 802 బ్యాక్ లాగ్ పోస్టులలో 432 ఎస్సీ, 370 ఎస్టీలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఈనెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.