VJ Sunny : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఎట్టకేలకు అట్టహాసంగా ముగిసింది. పలువురు స్టార్స్ నడుమ ఎంతో సందడిగా సాగిన ఈ షోలో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ తెగ సందడి చేశారు. అనేక ట్విస్ట్‌ల మధ్య బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా సన్నీని ప్రకటించారు. విజేతగా అవతరించిన సన్నీకి కింగ్ నాగార్జున బిగ్‌బాస్ ట్రోఫీని బహుకరించారు. అంతేకాక రూ.50 లక్షల చెక్‌ను అందజేశారు.
దీంతోపాటు సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని విన్నర్ సన్నీ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. టీవీఎస్ బైక్ కూడా గెలుచుకున్నాడని ప్రకటించారు. అయితే అమ్మ అడిగిన మొట్టమొదటి బహుమతి బిగ్‌బాస్ ట్రోఫీ అంటూ.. దాన్ని ఆమె చేతుల్లో పెట్టి సంతృప్తి చెందాడు.
సీజన్ 5 విజేతగా నిలిచిన సన్నీకి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. అతని అసలు పేరు అరుణ్ రెడ్డి. వీజేగా అలరించిన సన్నీ ఎట్టకేలకు సీజన్ 5 విజేతగా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. హౌజ్‌లో ఎంత కొట్టుకున్నా కూడా మేమందరం ఒకటే అని హుందాగా మాట్లాడి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. సన్నీకి ఇక సినిమా ఆఫర్స్ భారీగా రావడం ఖాయంగా కనిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…