Bigg Boss 5 : గత 3 నెలలుగా ఎంతో ఉత్సాహంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కొనసాగింది. ఎట్టకేలకు ఈ షోకు ఆదివారంతో తెరపడింది. ఈ క్రమంలోనే ఈ సీజన్‌కు విన్నర్‌గా వీజే సన్నీ నిలిచాడు. ఖమ్మం జిల్లాకు చెందిన వీజే సన్నీ బిగ్‌బాస్ ఇంట్లోకి టీవీ సీరియల్ ఆర్టిస్ట్‌గా అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే అతను టాప్ 5 ఫైనలిస్ట్స్‌లో ఒకడిగా నిలిచాడు. తరువాత సీజన్ 5 విన్నర్ అయ్యాడు.
గ్రాండ్ ఫినాలెలో టాప్ 5 లో శ్రీరామ చంద్ర, సన్నీ, సిరి, షణ్ముఖ్, మానస్ నిలిచారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున ఫినాలె వారంలో మొత్తం 13 కోట్ల ఓట్లు పోలైనట్లు తెలిపారు. కాగా గత 4 సీజన్లలోనూ ఒక్క ఫీమేల్ విన్నర్ కూడా లేకపోవడం విశేషం. ఈ 5వ సీజన్‌లోనూ ప్రేక్షకులు మేల్ కంటెస్టెంట్‌నే విన్నర్‌ను చేశారు. వీజే సన్నీ ఈ సీజన్‌కు విజేతగా నిలిచాడు. ఇక షణ్ముఖ్ రన్నరప్‌గా నిలవగా, శ్రీరామ చంద్ర మూడో స్థానంలో నిలిచాడు.
బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం అయింది. సరయు, ఉమా దేవి, లహరి షెరి, శ్వేతా వర్మ, ప్రియా, ప్రియాంక సింగ్, నటరాజ్ మాస్టర్, హమీదా, విశ్వ, రవి, లోబో, అనీ మాస్టర్, జెస్సీ, ఆర్‌జే కాజల్, సన్నీ, షణ్ముఖ్, సిరి, శ్రీరామచంద్రలతో ఈ సీజన్‌ను ప్రారంభించారు. చివరకు సన్నీ ఈ సీజన్‌కు విజేతగా నిలిచాడు.
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలెకు పలువురు సెలబ్రిటీలు అతిథులుగా వచ్చారు. దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, హీరోలు నాగచైతన్య, నాని, హీరోయిన్లు కృతి శెట్టి, ఆలియా భట్‌లతోపాటు రణబీర్ కపూర్, సాయి పల్లవి, రష్మిక మందన్న, శ్రియలు ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…