VJ Sunny : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలోకి వచ్చినప్పుడు అతడిని అందరూ నార్మల్ కంటెస్టెంట్‌గానే భావించారు. అందరూ అతనిపై దాడి చేస్తుండడంతో సన్నీ విజేత కాడనే అనుకున్నారు. కానీ అందరి ఆలోచనలను తలకిందులు చేస్తూ బిగ్ బాస్ సీజన్ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు సన్నీ. తాను పడ్డ వంద రోజుల కష్టమంతా ట్రోఫీ అందుకోగానే మటుమాయమైపోయింది. ఎన్నో ఏళ్లుగా సన్నీ పడుతున్న కష్టానికి నేడు ప్రతిఫలం దక్కిందని అతడి తల్లి భావోద్వేగానికి లోనైంది.
ఇన్ని రోజుల పాటు బిగ్‌బాస్ షోలో ఉన్నందుకు రెమ్యునరేషన్‌తో పాటు టైటిల్‌ను గెలుచుకున్నందుకుగాను రూ. 50 లక్షల ప్రైజ్ మనీకి సంబంధించి చెక్‌ను నాగార్జున చేతుల మీదుగా అందుకున్నాడు. ఇక అంతేకాకుండా సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్ తరఫున షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల ప్లాట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. వీటితో పాటు టీవీఎస్ కంపెనీకి చెందిన బైక్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.
బిగ్ బాస్ షో ద్వారా సన్నీ ఎంత లేదన్నా కోటి రూపాయలకు పైగానే అందుకున్నాడని సమాచారం. అయితే తన తల్లి కోరిక తీర్చాలని పదే పదే చెప్పుకొచ్చిన సన్నీ ఎట్టకేలకు ట్రోఫీ అందుకొని తల్లితోపాటు ఎందరో మనసులను గెలుచుకున్నాడు. తన ట్యాలెంట్‌తో ఇంకా ఎంతో సాధిస్తానని, తన తల్లికి బిగ్‌బాస్ ట్రోఫీలాంటి ఇంకా ఎన్నో బరువులు మోయాల్సి ఉంటుందని ఎంతో ధీమాగా చెప్పిన సన్నీ మరి ఏ మేర సక్సెస్ అవుతాడో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…