Categories: క్రైమ్‌

News : దారుణం.. పాప చ‌నిపోతుంద‌ని తెలిసినా చూసేందుకు రాని క‌సాయి తండ్రి.. మ‌న‌స్థాపంతో త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌..

News : కుటుంబ సభ్యుల‌ను కూడా కాద‌ని బ‌య‌ట‌కు వచ్చి ప్రేమించిన వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. కోటి ఆశ‌ల‌తో కొత్త జీవితం ప్రారంభించింది. ప్రేమ పెళ్లి క‌నుక భ‌ర్త త‌న‌కు జీవితాంతం తోడుంటాడ‌ని భావించింది. కానీ ఆమె ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి. ఆమె క‌న్న క‌ల‌లు క‌ల్ల‌లు అయ్యాయి. పాప పుట్టాక ఆమెకు అత‌ను దూరం అయ్యాడు. ఆ చిన్నారి అనారోగ్యం బారిన ప‌డి చ‌నిపోయే స్థితిలో ఉంద‌ని తెలిసినా.. ఆ మృగాడి క‌ఠిన హృద‌యం క‌ర‌గ‌లేదు. చివ‌ర‌కు ఆ చిన్నారితోపాటు ఆమె త‌ల్లి ప్రాణాల‌ను కోల్పోయారు. ఈ విషాద సంఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

విల్లుపురం జిల్లా మనలూరుపేట్‌లోని మారియమ్మన్ కోవిల్ వీధికి చెందిన వినోద్ కుమార్‌కు మనలూరుపేట్‌లోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న‌ ఆషా(26)తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇద్ద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. 2 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కొత్త‌గా జీవితాన్ని ప్రారంభించారు. అయితే వినోద్ పెద్దగా చదువుకోలేదు. దీంతో అత‌ను రోజూ కూలి ప‌నుల‌కు వెళ్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

అయితే ఆషా న‌ర్సు గ‌న‌క అదే హాస్పిట‌ల్‌లో య‌థావిధిగా రోజూ ప‌నికి వెళ్తుండేది. ఈ క్ర‌మంలోనే ఆ దంప‌తుల‌కు ఒక కుమార్తె జ‌న్మించింది. ఆ చిన్నారికి కావ్య అని పేరు పెట్టారు. కాగా కావ్య‌కు ఇటీవ‌లే ఏడాది నిండింది. ఈ క్ర‌మంలోనే కొన్ని రోజుల కిందట కావ్యకు తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. దీంతో ఆషా త‌ను న‌ర్సుగా ప‌నిచేస్తున్న హాస్పిట‌ల్‌లోనే ఆమెకు చికిత్స అందించింది. అయినా చిన్నారి ఆరోగ్యం కుదుట ప‌డ‌లేదు.

అయితే కావ్య అనారోగ్యం పాల‌వ‌డానికి ముందే వినోద్ వారిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. పాప తీవ్ర అనారోగ్యంతో ఉంద‌ని, చ‌నిపోయే స్థితిలో ఉంద‌ని, ఒక్క‌సారి వ‌చ్చి చూడాల‌ని ఆషా బ‌తిమాలింది. అయిప్ప‌టికీ వినోద్ పాషాణ హృద‌యం క‌ర‌గ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆ చిన్నారి క‌న్ను మూసింది. పాప మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేని ఆషా మ‌న‌స్థాపం చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ క్ర‌మంలో పోలీసులు వినోద్‌ను అరెస్టు చేసి కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM