Shanmukh : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఎట్టకేలకు ముగిసింది. షోలో విజేతగా నిలిచిన సన్నీ ట్రోఫీతోపాటు విల్లా, అపాచీ బైక్, పలు బహుమతులను అందుకున్నాడు. ఇక రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ రెమ్యునరేషన్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వెబ్ సిరీస్‌లతో భారీగా అభిమానులను కూడగట్టుకున్న అతడు ఈ సీజన్ ట్రోఫీని ఈజీగా గెలిచేస్తాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. కానీ తర్వాత సీన్ రివర్స్ అయింది.
బిగ్‌బాస్ షో సగానికి వచ్చాక అప్పుడు ఆట మొదలెట్టాడు. మాటకు మాట సమాధానమిచ్చాడు. ఎదుటివారి ఎత్తుగడలను చిత్తు చేస్తూ బ్రహ్మగా పేరు తెచ్చుకున్నాడు. సిరి, జెస్సీలే లోకంగా మోజ్ రూమ్‌లో ముచ్చట్లాడేవాడు. కాకపోతే సిరిని డామినేట్ చేస్తూ అతను గేమ్ ఆడుతూ వచ్చాడు. రాను రాను షణ్ముఖ్‌పై నెగెటివిటీ ఏర్పడింది. చెత్త ప్లాన్లు వేస్తూ వచ్చిన షణ్ముఖ్ ఈ సీజన్ రన్నరప్‌గా నిలిచాడు.
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో యాంకర్ రవి తర్వాత ఎక్కువ పారితోషికం అందుకున్న షణ్ను మొత్తంగా పదిహేను వారాలకు గాను రూ.65 లక్షల పైనే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు నెట్టింట ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. గెలుపు అంచుల దాకా వచ్చి టైటిల్ మిస్ అయిన ఈ బిగ్‌బాస్ బ్రహ్మ ఒక్క వారానికి అతడికి 4 నుంచి 5 లక్షల రూపాయలు అందుకున్నాడట. విన్నర్ కన్నా షణ్ముఖ్ ఎక్కువగా రాబట్టాడని వార్తలు వస్తుండగా, ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…