NTR : ఆర్ఆర్ఆర్ పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలవుతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ముంబైలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయ్యారు. అయితే ఫ్యాన్స్ ప్రవర్తన ఎన్టీఆర్‌కి అస్సలు నచ్చక పోవడంతో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
అభిమానులు కొందరు బారికేడ్లు పగలగొట్టుకుంటూ లోపలికి చొచ్చుకొచ్చారు. అరుపులు, గోలలతో రచ్చరచ్చ చేయడంతో స్టేజీపై ఉన్న సెలబ్రిటీలు కొంత అసహనం వ్యక్తం చేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. అందరూ కిందకు దిగుతారా ? లేదా ? పద్ధతిగా లేదు.. కిందకు దిగండి.. అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చాం.. అందరూ మన గురించి చాలా బాగా మాట్లాడుకోవాలని, అందరూ పద్ధతిగా కిందకు దిగండి.. అంటూ అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతోపాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌లు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టాడు. నాటు నాటు పాట కూడా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…