Radhe Shyam : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా వస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడగా, వరుసగా విడుదలవుతున్న పోస్టర్స్, సాంగ్స్ మరింత హైప్ తీసుకొస్తున్నాయి. ఈ సినిమాకి ‘జిల్’ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.
కృష్ణం రాజు సమర్పణలో గోపీ కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో.. ఈ చిత్రం ప్రమోషన్స్ లో వేగం పెంచారు. తాజాగా కృష్ణం రాజు పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పరమహంస అనే సాధువు పాత్రలో ఆయన లుక్ ఆకట్టుకునేలా ఉంది.
అహోబిలంలోని టెంపుల్ లో విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్న ప్రభాస్ కు, పరమహంస పాత్రలో కనిపించనున్న కృష్ణంరాజుకు మధ్య కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించినట్టు సమాచారం. తాజాగా కృష్ణం రాజుకి సంబంధించి విడుదలైన పోస్టర్ అందరినీ అలరించేలా ఉంది. ఈ చిత్రం సౌత్ లాంగ్వేజ్ సాంగ్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. 1960ల కాలం నాటి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రేక్షకులను తప్పకుండా మెప్పింస్తుందని ఈ చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…