Rekha Boj : ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది. భారత్ వేదికగా జరుగుతున్న ఈ ట్రోఫీలో భారత్ సత్తా చాటుతుంది. గత రాత్రి న్యూజిలాండ్‌తో జరిగన సెమీస్‌లో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక నవంబర్ 17న జరగనున్న ఫైనల్‌లోను విజయం సాధించి ట్రోఫీ దక్కించుకోవాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు. అయితే ఓ బోల్డ్ బ్యూటీ మాత్రం భారత్ గెలిస్తే వైజాగ్ బీచ్‌లో బట్టలు విప్పి అలా చేస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండియా వరల్డ్ కప్ కొడితే.. వైజాగ్ బీచ్‌లో స్ట్రీకింగ్ చేస్తా’.. అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది.
స్ట్రీకింగ్ అంటే.. ఒంటిపై బట్టల్లేకుండా పరుగుపెట్టడం అని అర్ధం. ఈ ట్రెండ్ ఎక్కువగా ఫారిన్ కంట్రీస్‌లో కనిపిస్తూ ఉండగా, వారు పట్టరాని ఆనందం కలిగినప్పుడు.. ఇలా బట్టలిప్పి వీధుల్లో పరుగుపెడుతూ రచ్చ చేస్తారు. ఇప్పుడు రేఖా భోజ్ కూడా ఇండియా గెలిచనప్పుడు ఆనందంతో బట్టలిప్పి వైజాగ్ బీచ్‌లో పరుగుపెడతానని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది . ఈ అమ్మడి మాదిరిగానే పలువురు బోల్డ్ బ్యూటీస్ ఇలా స్టేట్‌మెంట్స్ ఇవ్వడం మనం చూశాం. పూనమ్ పాండే తోపాటు అనేక మంది మోడల్స్ ఇలా స్టేట్‌మెంట్ ఇచ్చి పాపులారిటీ దక్కించుకున్నారు. ఇప్పుడు రేఖా భోజ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇలా బట్టలు విప్పేస్తాం అని కామెంట్ చేసింది.

క్రికెట్ అంటే ఎమోషన్.. కాబట్టి విప్పడంలో తప్పేం లేదు.. నేను మనస్పూర్తిగా ఇండియన్ క్రికెట్ మీద అభిమానంతో ఈ పని చేస్తున్నా తప్పితే.. హైప్ కోసం కాదు’ అని అంటుంది రేఖా బోజ్. ఈ అమ్మడు దామినీ విల్లా, కాత్సాయని వంటి సినిమాల్లో నటించింది. వైజాగ్ బ్యూటీ రేఖా భోజ్‌కి ప్రస్తుతం సరైన అవకాశాలు లేకపోవడంతో.. వైజాగ్‌లో సొంతంగా స్టుడియో పెట్టుకుని కవర్స్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ బోల్డ్ స్టేట్‌మెంట్ ఆధారంగా అందరి దృష్టిలో పడింది.