Mangalavaram Movie OTT Rights : ఆర్ఎక్స్100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమా తర్వాత పాయల్ చాలా సినిమాలు చేసిన కూడా ఏ సినిమా కూడా ఈ అమ్మడికి అంత పేరు తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో పాయల్ ఇప్పుడు మళ్లీ తనకి తొలి సినిమాతో మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతితో కలిసి మంగళవారం అనే సినిమా చేసింది. ఈ సినిమా గత కొద్ది రోజులుగా అందరి అటెన్షన్‌ని తిప్పుకుంటుంది. ఈ సినిమా ఫంక్షన్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావడం మరో ఎత్తు కాగా, ఆయన చేసిన కామెంట్స్‌తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి.
పాయల్ రాజ్ పుత్ కీలక పాత్రలో నటించిన మంగళవారం సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్రంకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక పాయల్ రాజ్ పుత్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఈ భామ మరోసారి రెచ్చిపోయి బోల్డ్ సీన్స్ లో నటించింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో పాటు నందితా శ్వేతా, దివ్యా పిళ్ళై, అజేయ గోష్, కృష్ణ చైతన్య, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మంగళవారం చిత్రంకి మెగా ఫ్యామిలీ సపోర్ట్ బాగానే కనిపిస్తుంది. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చి అల్లు అర్జున్ సపోర్ట్ చేయగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులను కూడా అల్లు అర్జున్ ఓటీటీ అయిన ఆహానే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. భారీ ధరకు ఈ సినిమాను సొంతం చేసుకుందని తాజా సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు. అజనీష్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌లో ఆయన కొట్టిన బీజీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఎందుకంటే ‘కాంతార’ సినిమా విజయంలో మ్యూజిక్, బీజీ కీ రోల్ పోషించాయి. ఇప్పుడు మంగళవారం సినిమాకి కూడా ఇది గట్టిగా ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది.