Pushpa 1 Moive Review : అల్లు అర్జున్ తొలి సారి పుష్ప అనే చిత్రంలో పక్కా మాస్ అవతారంలో నటించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ రోజు పుష్ప తొలి పార్ట్ విడుదల కాగా, ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందింది. రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్ర చందనం మొక్కలను కొట్టే కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప (అల్లు అర్జున్), అతి తక్కువ సమయంలోనే తన తెగువతో, తెలివితేటలతో స్మగ్లింగ్ సామ్రాజ్యంలో కీలకమైన వ్యక్తిగా ఎదుగుతాడు.
ఈ క్రమంలో అతన్ని అడ్డు పెట్టుకుని కోట్లు గడించిన కొండా రెడ్డి (అజయ్ ఘోష్), అతని తమ్ముళ్ళకు ఎలా చుక్కలు చూపించాడు ? ఎర్రచందనం సిండికేట్ లీడర్ గా చక్రం తిప్పే మంగళం శ్రీను (సునీల్)కు పక్కలో బల్లెంగా ఎలా మారాడు ? చిన్నప్పుడే ఇంటి పేరు కోల్పోయిన తనను ఆ కారణంతో అవమానించే వారికి ఎలా బుద్ధి చెప్పాడు ? అనేది చిత్ర కథ.
సినిమా ప్రారంభమైన మరుక్షణం నుండి ఆడియెన్స్ కు పుష్ప రాజ్ తప్ప అల్లు అర్జున్ కనిపించడు. బన్నీ పుష్ప పాత్రకు ఐకాన్ గా నిలిచాడు. మనసులో ఆవేదనను తల్లితో పంచుకునే సన్నివేశంలో ఎలా గుండెల్ని పిండేశాడో, ప్రియురాలికి ప్రేమను తెలిపే సీన్ లోనూ అంత వినోదాన్ని పండించాడు. శ్రీవల్లి పాత్రలో రష్మిక ఒదిగి పోయింది. ఎర్రచందనం స్మగ్లర్ కొండారెడ్డిగా అజయ్ ఘోష్, అతని తమ్ముడు జాలిరెడ్డిగా కన్నడ నటుడు ధనుంజయ్ చక్కగా నటించారు.
ఈ మూవీలో స్పెషల్ సర్ ప్రైజ్ ఎలిమెంట్ అంటే సునీల్ పోషించిన మంగళం శ్రీను పాత్ర. ఎర్రచందనం స్మగ్లర్స్ సిండికేట్ నాయకుడిగా సునీల్ సూపర్ గా యాక్ట్ చేశాడు. మంగళం శ్రీను భార్య దాక్షాయణిగా అనసూయ నటించింది. ఆమె మేకోవర్ కూడా డిఫరెంట్ గా ఉంది. సమంత స్పెషల్ సాంగ్ కూడా ఈ సినిమాకి అస్సెట్ అయింది.
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మీద మనవాళ్ళు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రావు రమేశ్ నటనను పూర్తి స్థాయిలో ఇందులో చూసే అవకాశం లేకుండా పోయింది. చంద్రబోస్ అందించిన పాటలు ఇటు సాహితీ కారుల్ని, అటు కుర్రకారుని ఆకట్టుకునే ఉన్నాయి. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ మూవీకి మరో హైలైట్. రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ యాక్షన్స్ సీన్స్ గూజ్ బంప్స్ కలిగిస్తాయి. బన్నీ ఫ్యాన్స్ కు, యాక్షన్ మూవీస్ ను ఇష్టపడే వారికి ‘పుష్ప’ సూపర్ కిక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…