Bigg Boss 5 : గత మూడు రోజులుగా హౌజ్‌మేట్స్ ను తమ తమ ఎమోషనల్ వీడియోలతో ఎంటర్‌టైన్ చేసిన బిగ్ బాస్ తాజా ఎపిసోడ్‌లో పలు టాస్క్‌లు ఇచ్చాడు. అంతకు ముందు సిరి-షణ్ముఖ్ ఇద్దరూ వేరే ప్రపంచంలోకి వెళ్లి పోయారు. సిరి నాకు పడిపోయావ్ కదా అంటూ ఆమె ఒడిలో తల పెట్టుకుని పులిహోర ముచ్చట్లు మాట్లాడాడు షణ్ను.
పాత టాస్కులను మరోసారి ప్రవేశపెట్టాడు బిగ్ బాస్. మొదటగా బెలూన్లలో గాలిని నింపుతూ వాటిని పగిలిపోయేలా చూడాలన్న టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో మానస్, షణ్ముఖ్ పోటీపడగా మానస్ గెలిచాడు. అనంతరం ఇంటిసభ్యులందరూ 13 నిమిషాలు లెక్కించాలని మూడో టాస్క్ ఇచ్చాడు. హౌస్‌మేట్స్ అంతా తీక్షణంగా క్షణాలను లెక్కిస్తున్న సమయంలో బిగ్‌బాస్ వారిని డిస్టర్బ్ చేసేందుకు నానారకాలుగా ప్రయత్నించాడు. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన షణ్ను బిర్యానీ గెలుచుకోగా దాన్ని అందరూ ఆరగించారు.
తర్వాత సిరి, షణ్ను ఒకరిగురించి మరొకరు మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆ సమయంలో బిగ్‌బాస్ నాలుగో టాస్క్‌లో కొన్ని శబ్ధాలు ప్లే చేయగా అవేంటో రాయాలన్నాడు. ఈ గేమ్‌లో బెకబెకల శబ్ధాన్ని సిరి ఎలుకగా గుర్తించి తప్పులో కాలేయడంతో అందరూ పగలబడి నవ్వారు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్ గెలుపొందాడు.
ఐదో టాస్కులో తాళ్లను ఎక్కువసేపు ఆపకుండా కదపాల్సి ఉంటుంది. ఇందులో సిరి, సన్నీ, షణ్ను ఆడగా సన్నీ గెలిచాడు. ఓడిపోయావ్ కదా, మళ్లీ ఆడదామా అంటూ సన్నీ సిరిని సరదాగా ఆటపట్టించాడు, కానీ ఆమెకు ఓడిపోయావన్న మాట అస్సలు నచ్చలేదు. తిందాం రమ్మని పిలిచినప్పటికీ రానంటూ మొండిగా ప్రవర్తించింది.
పక్కనోడు గెలిస్తే సహించలేనంటూ ఆవేశంతో ఊగిపోయింది. నాతో జోకులొద్దు అని సన్నీకి వార్నింగ్ ఇచ్చింది. సిరి అరవడంతో సహనం కోల్పోయిన సన్నీ ఆమెను ఇమిటేట్ చేయగా సిరి మరింత ఉడికెత్తిపోయింది. ప్రతిసారి వచ్చి ఇమిటేట్ చేయడమేంటని మండిపడింది. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా ? తోపు అని ఫీలవుతున్నావా ? అంటూ ఏకిపారేసింది. మాటలు పడింది నేను, మళ్లీ పిజ్జా తిందువు రా అని పిలిస్తే ఎవడొస్తాడు అని చిర్రెత్తిపోయింది.
అటు సన్నీ.. మానస్‌తో మాట్లాడుతూ.. ఎప్పుడు ఏ గొడవైనా కూడా నేనే వెళ్తాను, ఇంత ఓవరాక్టింగ్ బ్యాచ్ ఏంట్రా? వెళ్లేముందు నన్ను బ్యాడ్ చేస్తే వాళ్లకు ఏమొస్తదిరా ? నువ్వు పెద్ద హీరోవా ? అంటే నన్ను ఇష్టపడేవాళ్లకు, నా దునియాల నేను హీరోనే’ అని స్పష్టం చేశాడు సన్నీ.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…