సాధారణంగా సినీ ఇండస్ట్రీలో లక్ కలసి వచ్చి సినిమాలు బాగా హిట్ అవుతుంటే ఏ స్టార్ అయినా సరే రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేస్తారు. అది సహజంగా జరిగేదే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా.. పాపులర్ అయినప్పుడే అధిక మొత్తంలో రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తుంటారు. ఇక తాజాగా అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది.
నిజానికి ప్రగ్యా జైస్వాల్‌కు ఎప్పటి నుంచో అసలు ఒక్క హిట్ కూడా లేదు. అప్పుడెప్పుడో వరుణ్ తేజ్ సరసన కంచె మూవీలో నటించిన ఈ బ్యూటీకి గత 10 ఏళ్లలో ఒక్క హిట్ కూడా పడలేదు. కంచె తరువాత అఖండ రూపంలో ఇప్పుడు మళ్లీ ప్రగ్యా జైస్వాల్‌కు దశ తిరిగింది. ఆమె బాలకృష్ణ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. ఈ మూవీ హిట్ కావడంతో ఆమెకు లక్ కలసి వచ్చిందనే చెప్పాలి.
అఖండలో ప్రగ్యా కలెక్టర్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం రెమ్యునరేషన్‌ను బాగా పెంచినట్లు సమాచారం. ఏకంగా రూ.1 కోటి మేర డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. నిజానికి ప్రగ్యాకు ఇంతటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఎప్పుడూ లభించలేదు. కంచె హిట్ అయింది కానీ.. మరీ ఈ విధంగా హిట్ కాలేదు. ఈ క్రమంలోనే ఈమెకు అఖండతో స్టార్ డమ్ వచ్చింది. దీంతో దాన్ని ఈమె క్యాష్ చేసుకునే పనిలో పడింది.
ఇక ప్రగ్యాకు సీనియర్ నటులతో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలోనే చెప్పింది. కనుక ఈమెను మళ్లీ బాలకృష్ణ సినిమాలోనే తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. మరి ప్రగ్యా దశ ఇక నుంచి తిరిగిపోతుందా.. లేదా.. అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…