Bigg Boss 5 : బిగ్ బాస్ 5వ సీజన్ మరి కొద్ది రోజులలో ముగియనుంది. ఈ క్రమంలో ప్రేక్షకులకి మరింత వినోదాన్ని పంచేందుకు వైవిధ్యమైన టాస్క్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. మంగళవారం ఇంటి సభ్యులకు ‘రోల్ ప్లే’టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బిగ్‌బాస్-5 కంటెస్టెంట్స్ ఎవరెలా ప్రవర్తించారో చేసి చూపించారు ఇంటి సభ్యులు. దీనిలో భాగంగా.. సన్నీలా సిరి.. షణ్ముఖ్‌లా సన్నీ.. కాజల్‌లా శ్రీరామ్.. ఆనీ మాస్టర్‌లా మానస్.. రవిలా కాజల్.. వారి వారి పాత్రలలో పెర్ఫామెన్స్ ఇరగదీశారు.
షణ్ముఖ్ పాత్ర పోషించిన సన్నీ, సిరి పాత్ర పోషించిన షణ్ముఖ్‌ని అప్పడం చేశాడు. ప్రతిసారి ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ వారి మాదిరిగా సన్నీ రచ్చ చేశాడు. అతని యాక్షన్‌కి ఎలా రియాక్ట్ కావాలో తెలియక.. షణ్ముఖ్, సిరిలు వారి వారి పాత్రలోనే ఉండిపోయారు. హే.. హగ్ చేసుకోకు అని షణ్ముఖ్ అంటుంటే.. సన్నీ ఫ్రెండ్ షిప్ హగ్, ఫ్రెండ్ షిప్ హగ్ అని పెర్ఫామెన్స్ ఇరగదీసేశాడు.
టాస్క్ అయిపోయిన తరువాత.. సన్నీ దగ్గరకు వచ్చిన షణ్ముఖ్.. నువ్ చాలా వెకిలి చేష్టలు చేశావ్.. ఇమిటేట్ చేస్తే నాకు అస్సలు నచ్చదు.. ఇమిటేషన్ వేరు.. వెకిలివేరు.. నువ్ చేసినట్టుగా ఎదుటివాళ్లు నీ గురించి చేస్తే బాధ తెలుస్తుంది.. నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు అని గట్టిగానే చెప్పాడు షణ్ముఖ్. నేను కామెడీగానే చేశాను.. క్యారెక్టర్‌లో ఉన్నాను.. కాజల్‌ని కూడా తిట్టాను కదా.. నెక్స్ట్ టైం అలా చేయను అంటూ వచ్చి షణ్ముఖ్‌ని హగ్ చేసుకున్నాడు సన్నీ.
టాస్క్‌లో భాగంగా మానస్ క్యారెక్టర్‌లో ఉన్న కాజల్.. ప్రతిసారి పింకీకి ఐలవ్యూ చెప్పడాన్ని మానస్ తప్పుపట్టాడు. ఎంటర్‌టైనింగ్ చేస్తున్నామని కాజల్ చెప్పబోగా.. ‘ఎంటర్‌టైనింగ్‌గా చేస్తే చేయ్.. కానీ 100 సార్లు ఐ లవ్యూ అని ఎవడు చెప్పాడు ? ’ అని కాజల్‌పై మానస్ సీరియస్ అయ్యాడు. మొత్తానికి 94వ ఎపిసోడ్ సరదాగానే సాగింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…