Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈ అమ్మడు లక్ష్మీ కళ్యాణం చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై చందమామ సినిమాతో మంచి క్రేజ్ అందుకుంది. ఇటు సీనియర్ హీరోలు, అటు కుర్ర హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ గతేడాది అక్టోబర్ 30న తన చిరకాల మిత్రుడు, ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
గత కొద్ది రోజులుగా కాజల్ గర్భవతి అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె సినిమాలను సైతం రిజెక్ట్ చేస్తుందనే ప్రచారం కూడా సాగింది. అయితే ఇటీవల దీనిపై కొందరు ప్రశ్నించగా, కాజల్ సమయం వచ్చినప్పుడు చెబుతానని పేర్కొంది. తాజాగా కాజల్ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను నెటిజన్లు పట్టేసి వైరల్ చేస్తున్నారు.
కాజల్ తాజాగా తన స్నేహితులతో కలిసి సరదాగా దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇందులో కాజల్ కు కాస్త బేబీ బంప్ ఉన్నట్లు కనిపించింది. దీంతో ఆమె నిజంగానే గర్భం దాల్చిందని అభిమానులు భావిస్తున్నారు. అయితే తన ప్రెగ్నెన్సీ గురించి కాజల్ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ఇప్పుడు కాజల్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండడంతో త్వరలోనే కాజల్ ఈ విషయంపై స్పందిస్తుందని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…