Bhimla Nayak : వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించి కొన్నాళ్లుగా అందరిలోనూ సస్పెన్స్ నెలకొని ఉంది. సంక్రాంతికి రాదని పలుమార్లు ప్రచారం జరగగా, వాటిని ఖండిస్తూ వచ్చింది చిత్ర యూనిట్. కానీ చివరకు మూవీని జనవరి 12 నుండి తప్పించి ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు. ఫిబ్రవరి 25కి మార్చినట్లు తాజాగా వెల్లడించారు.
వాస్తవానికి సంక్రాంతి బరిలో పవన్ ఉంటారని అందరూ భావించారు. కానీ ఆయన అభిమానులకు షాక్ ఇస్తూ చిత్రం విడుదలను వాయిదా వేశారు. ఈ సంక్రాంతికి పాన్ ఇండియా సినిమాలు ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు విడుదలవుతున్నాయి. దీంతో థియేటర్లకు సంబంధించి ఇబ్బందులు కలగకూడదని ‘భీమ్లా నాయక్’ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దిల్ రాజు నేతృత్వంలో జరిగిన చర్చలు ఫలించడంతో భీమ్లా నాయక్ వాయిదా పడింది.
మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన భీమ్లా నాయక్ చిత్రంకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలు. దర్శకుడు త్రివిక్రమ్ మాటలు రాస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీని ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…