Hamsa Nandini : హీరోయిన్ హంసా నందిని షాకింగ్ న్యూస్ చెప్పారు. తన ఆరోగ్యానికి సంబంధించి ఓ పిడుగు లాంటి వార్త చెప్పారు. తనకు వైద్య పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు.
హంసా నందిని తాజాగా ఓ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. అందులో సుదీర్ఘమైన సందేశం ఉంది. దాంట్లో తనకు క్యాన్సర్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తనకు హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ పాజిటివ్ (BRCA 1) ఉందని చెప్పారు. తనకు 70 శాతం బ్రెస్ట్, 40 శాతం అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని గతంలోనే చెప్పారని.. ఈ క్రమంలోనే తనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని తెలిపారు. అయితే ఈ సమస్య నుంచి బయట పడేందుకు సర్జరీలు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కీమోథెరపీ, లుమ్పెక్టమి చేయించుకోవాల్సి ఉంటుందన్నారు.
ఇప్పటికే కీమోథెరఫీ 9 సార్లు చేయించుకున్నానని, ఇంకా 7 సార్లు చేయించుకోవాల్సి ఉందని తెలిపారు. అయితే క్యాన్సన్ వచ్చినా తానేమీ కుంగిపోనని, తాను పోరాటం చేస్తానని తెలిపారు. ఈ సవాల్‌ను తాను సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి వెండితెరపై కనిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాగా హంసా నందిని వయస్సు ప్రస్తుతం 37 ఏళ్లు కాగా.. ఈమె గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఈమె పూణెలో ఉంటోంది.
4 నెలల కిందట హంసా నందిని తన బ్రెస్ట్‌ళో చిన్న గడ్డను గుర్తించింది. అప్పుడే అనుమానం వచ్చిందని, అది క్యాన్సర్ అయి ఉంటుందని తెలిపింది. కాగా 18 ఏళ్ల కిందటే తన తల్లి బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించింది. దీంతో వంశ పారంపర్యంగా ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తనకూ ఈ వ్యాధి వచ్చిందని చెప్పింది.
అయితే తాను కొంత కాలం నుంచి సోషల్ మీడియాకు, ఇండస్ట్రీకి దూరంగా ఉంటుండడంతో అందరూ తనకు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారని.. తన పట్ల చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది. క్యాన్సర్ అంటే తాను భయపడేది లేదని, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నానని వివరించింది. క్యాన్సర్‌ను జయిస్తానన్న నమ్మకం తనకు ఉందని తెలిపింది.
కాగా హంసా నందిని 2004లో విడుదలైన ఒక్కటవుదాం అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. 2018లో విడుదలైన గోపీచంద్ పంతం మూవీలో ఆమె చివరిసారిగా కనిపించింది. ఆమె అనేక సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయడంతోపాటు పలు ఐటమ్ సాంగ్‌లలోనూ నటించి మెప్పించింది. ఏది ఏమైనా హంసా నందినికి క్యాన్సర్‌కు అని తెలియడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…