Bhanu Sri : తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు భానుశ్రీ అంటే తెలుసు. ఈమె గురించి ఎవరికీ పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లో బిగ్ బాస్ సీజన్ 2లో ఈమె అలరించింది. తరువాత ఈమెకు పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పటికీ అడపా దడపా సినిమాల్లో, సిరీస్‌లలో కనిపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఈమె తన గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హీటిక్కెస్తుంటుంది.
బిగ్‌బాస్ ద్వారా భానుశ్రీ ఫేట్ మారిపోయిందనే చెప్పవచ్చు. అటు బుల్లితెరతోపాటు ఇటు వెండితెరపై కూడా ఈమెకు అవకాశాలు చాలానే వచ్చాయి. దీంతోపాటు ఈమె అభిమానులను కూడా బాగానే సంపాదించుకుంది. ఏడు చేపల కథ అనే ఓ మూవీ ద్వారా ఈమె యువతలో సెగలు రేపింది. తరువాత జబర్దస్త్‌లోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ వస్తోంది. ఇక ఈవెంట్స్‌లోనూ ఈ భామ పాల్గొంటూ బాగానే సంపాదిస్తోంది.
డ్యాన్స్ పరంగా కూడా భానుశ్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ప్రస్తుతం మాత్రం ఈమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదనే చెప్పాలి. కావల్సినంతగా గ్లామర్ ఒలకబోస్తున్నా ఆఫర్లు మాత్రం లభించడం లేదు. ఇక తాజాగా ఈమె వ్యక్తిగత జీవితానికి చెందిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. వాటిపై స్పందించింది.
తాను సినిమాల్లో నటించడం తన తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేదట. అయినప్పటికీ ఆమె వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. కెరీర్ తొలినాళ్లలో డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడింది. ఈ క్రమంలోనే తనకు తన బాయ్ ఫ్రెండ్ సహాయం చేశాడు. సిటీకి వచ్చిన కొత్తలో ఆమె ఉండడానికి రూమ్ లేకపోవడంతో ఓ జ్యూస్ సెంటర్‌లో రాత్రి నిద్రించేదట.
ఇక సినిమాల్లో భానుశ్రీ ఎంతో ట్రై చేసినా ఆమెకు ఆఫర్స్ రాలేదట. దీంతో తనకు బాయ్ ఫ్రెండ్ అండగా ఉన్నాడట. అమ్మానాన్నల కన్నా ఎక్కువగా అతను తనకు తోడున్నాడట. దీంతో అతనే తనకు ఎక్కువ.. అంటూ భానుశ్రీ చెప్పుకొచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…