Rashi Khanna : బన్నీ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక సినిమా పుష్ప. ఈ మూవీ మొదటి భాగాన్ని ‘పుష్ప ది రైజ్’ పేరుతో నేడు (డిసెంబర్ 17) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. షూటింగ్ ప్రారంభం నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. సుకుమార్ ఇచ్చిన ప్రతి అప్‌డేట్ కూడా ఆ అంచనాలకు రెక్కలు కట్టింది. తొలి షో కంటే ముందే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ తమ స్పందన తెలియజేస్తున్నారు.
అయితే పుష్ప సినిమా టిక్కెట్స్ కోసం సామాన్యులతోపాటు సెలబ్స్ సైతం కష్టపడుతున్నారు. దర్శకుడు మారుతి ‘పుష్ప’ సినిమా కోసం హైదరాబాద్‌లో ఎర్లీ మార్నింగ్ షో టికెట్లు కావాలి.. అని కామెంట్ పెట్టాడు. అది కూడా 20 టిక్కెట్స్. దీనికి హీరోయిన్ రాశీఖన్నా.. ‘కష్టం సార్.. నేను కూడా ట్రై చేస్తున్నా’ (నవ్వుతున్న ఎమోజీతో) రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
బన్నీకి అత్యంత ఆత్మీయుడైన మారుతికి సినిమా టికెట్ దొరకకపోవడం ఏంటి ? విడ్డూరం కాకపోతే.. అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, మారుతి దర్శకత్వంలో రాశీ ఖన్నా పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా పక్కా కమర్షియల్ వస్తోంది.
గతంలో జిల్, ఆక్సిజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశి ఖన్నా. హీరోయిన్ రాశీ ఖన్నా ఆకాశం నుంచి నేలపైకి వస్తున్న దేవకన్యలా కనిపించనున్నారు. ఈమె క్యారెక్టర్‌ను ప్రతిరోజూ పండగే మాదిరే ఇందులోనూ మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…