Categories: వినోదం

Bigg Boss 5 : ఆగ‌ని హ‌గ్గులు, ముద్దులు.. జాత‌కాలు చెప్పించిన బిగ్ బాస్..

Bigg Boss 5 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్యక్ర‌మం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మ‌రో రెండు రోజుల‌లో ఫినాలే జ‌ర‌గ‌నుండ‌గా బిగ్ బాస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ జాత‌కాలు చెప్పించారు. ముందుగా ష‌ణ్ముఖ్ గురించి చెబుతూ.. మీ జీవితంలో మంచి మార్పు ఉండబోతోంది. మీ ప్రేమ జీవితం బాగుండబోతోంది. కొంగొత్త అవకాశాలతో కావాల్సినంత సంపాదించబోతారు.. అని చెప్పింది.

స‌న్నీ గురించి చెబుతూ.. బ‌య‌ట‌కు వ‌చ్చాక కొత్త ప్ర‌యాణం మొద‌లుపెడ‌తారు. త్వ‌ర‌లో స్వ‌ప్ప సుంద‌రి ప్రేమ‌లో ప‌డ‌తార‌ని స్ప‌ష్టం చేసింది. ఇక సిరి గురించి చెప్తూ.. త్వరలో పెళ్లిబాజాలు మోగనున్నాయని శుభం పలికింది. శ్రీరామచంద్రకు గెలుపు కార్డు వచ్చిందన్న ఆమె అతడు లోలోపల చాలా కన్‌ఫ్యూజ్‌ అవుతున్నాడంది.

బిగ్‌బాస్‌ షో తర్వాత అతడికి ఎన్నో అవకాశాలు రాబోతున్నాయని పేర్కొంది. మానస్‌కు బిగ్‌బాస్‌ జర్నీ తర్వాత అన్నీ సాధించానన్న తృప్తి మిగులుతుందని తెలిపింది. బిగ్‌బాస్‌ తర్వాత సిరి పెళ్లి చేసుకోవడంతోపాటు ఫారిన్‌కు హనీమూన్‌కు కూడా వెళ్తుందని చెప్పుకొచ్చింది.

ఇక హౌజ్ లో జంట పాములు మాదిరిగా ఉన్న సిరి, ష‌ణ్ముఖ్‌లు ఎప్పుడు హ‌గ్ లు చేసుకుంటారో ఎప్పుడు గొడ‌వ‌లు ప‌డ‌తారో చెప్ప‌డం క‌ష్టంగా మారింది. తాజాగా ఆ ఇద్ద‌రూ మ‌రోసారి గొడ‌వ‌ప‌డ్డారు. ఇద్దరి కోసం కాకుండా అందరికీ ఎందుకు వంట చేస్తావని మండిపడ్డాడు షణ్ను. నువ్వు పొద్దున చేసిన దోశెలు వాళ్లు తినలేదని, అలాంటప్పుడు మళ్లీ ఎందుకు వండతావని ఫైర్‌ అయ్యాడు.

దీంతో రెచ్చిపోయిన సిరి.. నేను కష్టపడి వండితే ఎందుకు తినలేదని మానస్‌ను నిలదీసింది. మానస్‌ మాత్రం తాను తిన్నానని చెప్పాడు. సన్నీకి రైస్‌ తినాలనిపిస్తే పులిహోర చేసుకుని తిన్నాడని బదులిచ్చాడు. అయినప్పటికీ వినిపించుకోని సిరి, షణ్ను మా వంట మేము చేసుకుంటామని తేల్చేశారు.

బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులందరినీ సూట్‌కేసులు ప్యాక్‌ చేసుకోమని చెప్పాడు. ఈ మాట విని అవాక్కైన హౌస్‌మేట్స్‌ అయిష్టంగానే బ్యాగులు సర్దుకున్నారు. మీలో ఒకరి ప్రయాణం ఈ క్షణమే ముగుస్తుందంటూ షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ ఎవరు ఎలిమినేట్‌ అవ్వాలనే దానిపై మీ అభిప్రాయం చెప్పాలని కంటెస్టెంట్లను ఆదేశించాడు. అనూహ్యంగా సిరి ఇంటి నుంచి వెళ్తుందని ప్రకటించడంతో ఆమె, షణ్ను ఏడ్చేశారు.

సిరిని కన్ఫెషన్‌ రూమ్‌లో కూర్చోబెట్టి షణ్ను ఏడుస్తున్న వీడియో చూపించాడు బిగ్‌బాస్‌. షణ్ను కంటతడి పెట్టుకోవడాన్ని చూసి సిరి హృదయం ముక్కలైంది. గేటు నుంచి బయటకు వెళ్లగొట్టిన కాసేపటికే తిరిగి ఆమెను హౌస్‌లోకి పంపించారు. దీంతో సిరి ఆనందంతో వెళ్లి షణ్నును హత్తుకుని ముద్దులు పెట్టింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM