Bigg Boss 5 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఎంతో ఉత్కంఠగా కొనసాగుతోంది. ఫినాలె దగ్గర పడుతుండడంతో ఎవరు ఇంట్లో ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు టాప్ 5 లో నిలుస్తారు.. అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇక తాజాగా ఎలిమినేషన్ ప్రక్రియ కూడా అంతే ఉత్కంఠగా సాగింది. లీకు వీరుల ద్వారా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో ముందుగానే తెలిసిపోయింది. అనుకున్నట్లుగానే ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ ఈ వారం ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలోనే 13 వారాల పాటు ఆమె హౌస్‌లో సందడి చేసింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ప్రియాంక సింగ్ ప్రత్యేక కంటెస్టెంట్‌గా పాల్గొంది. ట్రాన్స్‌జెండర్‌గా అందరినీ ఆకట్టుకుంది. ఆమె మానస్‌తో నడిపిన లవ్ ట్రాక్ అక్కడక్కడా బోర్ కొట్టించినా.. ఓవరాల్‌గా చూస్తే ఆమెది నిజమైన ప్రేమ అని స్పష్టమవుతుంది. అయితే అది బిగ్ బాస్‌కే పరిమితం అవుతుందా.. బయటకి వచ్చాక అలాగే ఉంటుందా.. అన్నవివరాలు తెలియాల్సి ఉంది.
ఇక ప్రియాంక 13 వారాల పాటు బిగ్ బాస్ ఇంట్లో ఉండగా.. ఆమెకు వారానికి రూ.2 లక్షల చొప్పున మొత్తం 13 వారాలకు రూ.26 లక్షల మేర చెల్లించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె బిగ్‌బాస్‌లో పాల్గొని ఎంతో మంది అభిమానులను సైతం సొంతం చేసుకుందని చెప్పవచ్చు. నిజానికి టాప్ 5లో ప్రియాంక ఉంటుందని భావించారు. కానీ ఈ వారం ఆమెకు ఓట్లు తక్కువ పడినందునే ఆమె ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది.
ఇక బిగ్ బాస్ ఇంట్లో ప్రియాంక అందరితోనూ చనువుగా ఉంటూ సరదాగా మాట్లాడింది. అందరికీ వంట చేసి పెట్టింది. అందరికీ సహాయం చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోతూ భావోద్వేగానికి గురై ఏడ్చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…