Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ (NTR) జెమిని టీవీ (Gemini TV)లో చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeshwarulu) షోకు మంచి ఆదరణే లభిస్తోంది. సెలబ్రిటీలు గెస్ట్‌లుగా వచ్చినప్పుడు మాత్రం రేటింగ్స్ ఒక రేంజ్‌లో ఉంటున్నాయి. ఇక తాజా ఎపిసోడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మహేష్ పాల్గొన్న ఈ ఎపిసోడ్‌కు ఫ్యాన్స్ నుంచి విశేషమైన రీతిలో స్పందన లభించింది. నిర్వాహకులు అనుకున్నదానికన్నా ఎక్కువ వినోదాన్ని అందించారు. దీంతో ఇద్దరు స్టార్స్‌కు చెందిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇక ఈ ఎపిసోడ్‌లో భాగంగా మహేష్‌ను ఎన్‌టీఆర్ పలు తికమక పెట్టే ప్రశ్నలు అడిగారు. దీంతో మరింత వినోదం లభించింది. అయినప్పటికీ మహేష్ తడుముకోకుండా సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. అయితే ఈ షోలో మహేష్‌ని రెండు ప్రశ్నలు బాగానే ఇబ్బంది పెట్టాయని చెప్పవచ్చు. దీంతో ఆయనహెల్ప్‌లైన్ వాడుకున్నారు.
మొదట 10 ప్రశ్నల వరకు మహేష్ ఎలాంటి హెల్ప్‌లైన్ వాడుకోకుండానే సమాధానాలు చెప్పారు. దీంతో 3 హెల్ప్‌లైన్స్ అలాగే ఉండిపోయాయి. ఈ క్రమంలోనే 11వ ప్రశ్న కింద మహేష్‌కు ఎన్‌టీఆర్ చరిత్రకు సంబంధించిన ప్రశ్న వేశారు. హరిహర రాయలు, బుక్కరాయలు ఏ రాజవంశానికి చెందినవారని అడిగారు. ఈ ప్రశ్నకు మహేష్ తడబడ్డారు. దీంతో హెల్ప్ లైన్ తీసుకున్నారు. మహేష్ ఫేవరేట్ దర్శకులలో ఒకరైన కొరటాల శివకు వీడియో కాల్ చేశారు. కొరటాల శివ సంగమ రాజవంశం అని రైట్ ఆన్సర్ చెప్పారు.
ఇక 12వ ప్రశ్నగా ఫుట్ బాల్‌కు చెందిన అంశం గురించి అడిగారు. అయితే దీనికి మహేష్ ఈజీగా జవాబు చెప్పారు. ఇక 13వ ప్రశ్నకు మహేష్ మళ్లీ టెన్షన్ పడ్డారు. ఈ ప్రశ్నకు కూడా ఆయన హెల్ప్ లైన్ వాడుకున్నారు. జంతువు బొమ్మ లేని లోగో ఉన్న కార్ బ్రాండ్ పేరు చెప్పాలని మహేష్ ని ఎన్టీఆర్ అడగ్గా.. హెల్ప్ లైన్ ద్వారా నాలుగు ఆప్షన్స్ లో రెండు రాంగ్ ఆన్సర్స్ ను తొలగించారు. ఫెర్రారీ, లాంబోర్గిని రెండు ఆప్షన్స్ లో.. లాంబోర్గిని అని మహేష్ సరైన సమాధానం చెప్పారు.
కాగా ఆదివారం ఎపిసోడ్ అయిపోయే వరకు మహేష్ మొత్తం 13 ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ.25 లక్షలు గెలుచుకున్నారు. తరువాతి ఎపిసోడ్‌ళో ఆయన రూ.50 లక్షలు, రూ.1 కోటి కి చెందిన ప్రశ్నలను ఎదుర్కోనున్నారు. అయితే మహేష్ షోలో రూ.25 లక్షలు మాత్రమే గెలుచుకున్నారని ఇప్పటికే వార్త లీకైంది. దీంతో ఆయన తరువాతి రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవచ్చని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…