Allu Arjun : కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల కాబోతున్న మరో బడా చిత్రం పుష్ప. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘అల వైకుంఠపురములో’ వంటి సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రం కావడంతో దీనికి బన్నీ చాలా కష్టపడ్డాడు. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా అల్లు అర్జున్ కొత్త లుక్ లో కనిపిస్తాడు. పుష్పరాజ్ గా ఆయన నటన అద్భుతం. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగ్స్ మెప్పిస్తాయని నిర్మాతలు చెప్పారు.
”పుష్పరాజ్ పాత్రకు సంబంధించి అల్లు అర్జున్ మేకప్ కోసమే ప్రతిరోజూ 2 గంటలు సమయం పట్టేది. దీని కోసం ఆయన పొద్దున్నే నిద్ర లేచేవాడు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ మేకప్ తీసేయడానికి మరో ఒకటిన్నర – రెండు గంటలు పడుతుంది. ఇలా మేకప్ కు మాత్రమే కొన్నిసార్లు 7-8 గంటలు సమయం కేటాయించేవారు. మిగతా టైంలో షూటింగ్ చేసేవారు. బన్నీ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తారు. ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్” అని చెప్పుకొచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో కలిపి మూడువేల థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదలచేయబోతున్నామని మేకర్స్ అంటున్నారు. ఎర్రచందనం అక్రమరవాణాతోపాటు మానవీయ విలువలు, భావోద్వేగాల కలబోతగా చక్కటి అనుభూతిని పంచే విధంగా చిత్రాన్ని తెరకెక్కించారు. రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నిడివితో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠ భరితంగా సినిమా సాగుతుందని, ఆ విధంగా స్క్రీన్‌ప్లే ఉంటుందని సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…