Gold : కర్ణాటక రాష్ట్రంలో వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు బంగారు చెయిన్ ను మింగేసింది. దీంతో దాన్ని సర్జరీ చేసి తీసేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా సిర్సి తాలూకా హీపనహల్లి అనే ప్రాంతంలో ఉంటున్న శ్రీకాంత్ హెగ్డె అనే కుటుంబానికి నాలుగేళ్ల వయస్సు ఉన్న ఓ ఆవు, దానికి దూడ ఉన్నాయి.
కాగా ఇటీవల దీపావళి సందర్భంగా ఇంట్లో ఆవులకు గోపూజ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆవులకు పూలమాలలు, బంగారు ఆభరణాలను వేసి పూజలు చేశారు. పూజల అనంతరం వాటిని తీసేశారు. అయితే ఓ ఆవు దూడ మెడకు 20 గ్రాముల బంగారు చెయిన్‌ను వేశారు. అది పూలమాలలో కలిసిపోయి ఉంది. దీంతో ఆ దూడ దాన్ని తినేసింది. ఆ చెయిన్ కాస్తా దాని పొట్టలోకి వెళ్లిపోయింది.
అయితే పూజలో ఉపయోగించిన చెయిన్ కనిపించడం లేదని ఆ కుటుంబ చెయిన్ కోసం ఎంతగానో వెదికింది. అయినప్పటికీ ఫలితం లేదు. అలా వారు నెల రోజులుగా ఆవుల షెడ్లు, వాటి పేడలో చెక్ చేస్తూ వచ్చారు. చివరకు వెటర్నరీ డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షించి చూడగా దాని పొట్టలో చెయిన్ ఉన్నట్లు తేలింది.
ఈ క్రమంలోనే డాక్టర్ ఆ ఆవుకు సర్జరీ చేసి చెయిన్‌ను బయటకు తీశారు. అయితే 20 గ్రాములు ఉండాల్సిన ఆ చెయిన్ కాస్తా 18 గ్రాముల బరువు తూగింది. మిగిలిన రెండు గ్రాములు ఆవు పొట్టలోని యాసిడ్ల వల్ల కరిగిపోయిందని తేలింది. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఆ చెయిన్ పూర్తిగా కరిగిపోయి ఉండేదన్నమాట. అయితే ఆ ఆవు ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…