Akhanda Movie : నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. కేవలం మాస్ జనాలు మాత్రమే కాదు.. మహిళలు కూడా సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. బాలయ్య సినిమాలపై ఆసక్తి చూపనివారు సైతం మౌత్ టాక్ చూసి మూవీ చూసేందుకు వెళ్తున్నారు. అఖండ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తో దూసుకుపోతుడగా, నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ రూ.100 కోట్ల మార్క్ అందుకోబోతున్నారని స్పష్టమైంది.
అఖండమైన విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర విజయోత్సవ వేడుక వైజాగ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటి పూర్ణ మాట్లాడుతూ.. అఖండమైన విజయం మాది. ఇది ప్రేక్షకుల విజయం. అందరు అభిమానులు ఈ సినిమాను చూసి హిట్ చేశారు. బాలయ్య గారి గురించి చెప్పేందుకు మాటలు చాలడం లేదు. సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఇంత కంటే ఎక్కువ చెప్పలేను. ఈ సినిమాలో అఘోర పాత్ర నన్ను వెంటాడింది. మీలాంటి వారితో పని చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను అని చెప్పేసింది.
“అఖండ” సినిమాతో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను హ్యాట్రిక్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ‘అఖండ’ జాతర బాలయ్య ఫ్యాన్స్ నే కాకుండా అందరినీ ఆ దైవభక్తికి సంబంధించిన ట్రాన్స్ లోకి నెట్టేసింది. అయితే ఇప్పుడు బాలయ్యకు పూర్ణ ఏకంగా సాష్టాంగ నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…