Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ప్రభాస్ ఇంటివాడు కాబోయే ఆ అమ్మాయి ఎవరు అని గూగుల్ లో వెతికితే.. మీరు పొరపడినట్లే.. ప్రభాస్ ఓ కొత్త ఇంటికి ఓనర్ కాబోతున్నారు. హైదరాబాద్ లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు.
రీసెంట్ గా ప్రభాస్ ముంబైలో ఓ పెద్ద బంగ్లా కొన్నాడు. అలాగే హైదరాబాద్ లో బిగ్గెస్ట్ లగ్జరీ విల్లాను కట్టించడానికి ప్లాన్ చేస్తున్నాడట. దానికోసం ఇప్పటికే హైదరాబాద్ నానక్ రామ్ గూడలో 2 ఎకరాలను 120 కోట్ల రూపాయలకు కొన్నాడు. ఈ ప్లేస్ లో తనకు నచ్చినట్లుగా అన్ని సౌకర్యాలతో విల్లాను డిజైన్ చేయించుకుంటున్నాడట. ఈ ఇంటిని నిర్మించేందుకు దాదాపుగా రూ.80 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఇంటి మీద స్పెషల్ ఫోకస్ తీసుకుని, అద్భుతమైన డిజైన్ తో ప్లాన్ చేస్తున్నాడట.
ఈ లెక్కన చూస్తే స్థలం రూ.120 కోట్లు, విల్లాకి రూ.80 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే ప్రభాస్ ఈ విల్లా కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఎంత డబ్బు అనేది పక్కన పెడితే ప్రభాస్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ తనకు దక్కుతుందనే ఆనందమే ఎక్కువగా ఉందనే విషయం స్పష్టం అవుతోంది. ఈ వార్త తెలిసిన తర్వాత ప్రభాస్ ఇంటికి రాబోయే అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…