NTR : రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ప్రస్టీజియస్ ప్రాజెక్ట్ `ఆర్‌ఆర్‌ఆర్`. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. రామ్‌చరణ్‌కి జోడీగా బాలీవుడ్ నటి అలియాభట్, ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోర్రీస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ డానయ్య ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా పదికిపైగా భాషల్లో విడుదల కానుంది.
ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ముంబైలో చిత్ర ట్రైలర్ ఈవెంట్ నిర్వహించగా, ఈ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆయనకు మీడియా పలు ప్రశ్నలు సంధించగా, తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్ని ఆఫర్స్ వదులుకున్నారని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా, దానికి షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది. నేను ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి పెట్టానని.. రాజమౌళితో సినిమా చేస్తున్నానని తెలిసినప్పుడు నాకు మరో ఆఫర్ ఎవరిస్తారంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు తారక్. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న ఎన్టీఆర్ త్వరలో సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్, బుచ్చిబాబుతో పాటు పలువురు దర్శకులతో సినిమాలు చేయనున్నాడు.
అయితే ప్రస్తుత తరుణంలో స్టార్ హీరోలు అందరూ ఏడాదికి ఒక సినిమాను చేస్తున్నారు కనుక.. ఎన్‌టీఆర్ కూడా 3, 4 సినిమాలను వదులుకున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…