ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి వార్తను తెలియజేసింది. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంస్థలు ఖాళీగా ఉన్న కానిస్టేబుల్, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టులకు వేరువేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమయింది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 170 గ్రూప్- బీ, గ్రూప్- సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎయిర్ వింగ్ 65, పారామెడికల్ 75, వెటర్నరీ 35 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారు పోస్ట్ ను బట్టి వివిధ విద్యార్హతలు, వయసు ఉంటుంది. ఉద్యోగానికి అభ్యర్థులను రాత పరీక్ష, డాక్యుమెంటేషన్ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి జులై 26 2021 దరఖాస్తు చివరితేది. మహిళా అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు లేదు. ఇతరులు ₹100 పరీక్ష రుసుం చెల్లించాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను అభ్యర్థులు ఈ https://bsf.gov.in/ చూడవచ్చు.
ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ రెండవ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ 65 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో ఉన్నవి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10 ఉత్తీర్ణత సాధించి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బహుమతి గెలుచుకొని ఉండాలి. వీరి వయస్సు 18 నుంచి 23 మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఖాళీలకు సంబంధించి మరిన్ని వివరాలను ఈ క్రింది వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. https://recruitment.itbpolice.nic.in/ఈ దరఖాస్తు కు సెప్టెంబర్ 2 2021 ఆఖరి తేదీ.