టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ అచ్చ తెలుగు ఇంటికోడలిగా అందరి అభిమానాన్ని పొందిన సమంత ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత ఇప్పటికే వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఈమె త్వరలోనే నగల వ్యాపారం కూడా ప్రారంభించబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా సమంత గురించి మరొక ఆశక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంత త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తరచూ షూటింగ్లకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండటంతో ఈమె ముంబైలో ఏకంగా ఒక ఫ్లాట్ కొనాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ముంబైలో ఫ్లాట్ కొనడం కోసం సమంత అక్కడ ఒక అందమైన ఇంటిని వెతికే పనిలో పడ్డారని సమంత సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇకపోతే ది ఫ్యామిలీ మెన్ 2సిరీస్ ద్వారా మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న సమంత గుణశేఖర్ దర్శకత్వంలో “శాకుంతలం” అనే పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ షూటింగ్ పనులలో ఉన్నారు.