ఈ మధ్యకాలంలో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలను షేర్ చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలా ఎంతో మంది పలురకాల వీడియోలను చేస్తూ డబ్బులు సంపాదించడం మనం చూసే ఉంటాం. అయితే ఇక్కడ ఒక యువకుడు మాత్రం తింటూ లక్షలు సంపాదిస్తున్నాడు.
సంబల్‌పూర్ జిల్లాలోని బాపుపాలిలో నివసిస్తున్న 35 యేళ్ళ ఇసాక్ ముండా రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు.అయితే కరోనా కారణం చేత అతని జీవితం ప్రశ్నార్థకంగా మారింది ఈ క్రమంలోనే ఏం చేయాలో దిక్కుతోచని క్రమంలో తన స్నేహితులు యూట్యూబ్ వీడియోలు చూడటం గమనించి ఒక అద్భుతమైన ఐడియాకు తెరలేపాడు తాను కూడా మూడు వేల రూపాయలు పెట్టి ఒక ఫోన్ కొని తన పేరు పై ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాడు.
వారి గ్రామంలోని ప్రజలు దయనీయస్థితులు, అక్కడివారు జీవనశైలి, ఆహారపు అలవాట్లను గురించి వీడియోలు తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేసే వాడు. ఈ విధంగా అతని మొదటి వీడియోకి సుమారు 4.99 లక్షల మంది వీక్షించారు. దీంతో ఇసాక్ తిరిగి చూసుకోలేదు. యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం చూడకుండా ఏకంగా 250 వీడియోలను తన ఛానల్ లో పోస్ట్ చేశాడు.ఇసాక్ కేవలం వారి జీవన విధానం మాత్రమే కాకుండా పలు ఆహారపదార్థాలను తింటూ వీడియోలను చేసేవాడు. ఈ విధంగా తొలి వీడియోను పోస్ట్ చేసిన మూడు నెలలకు అతని అకౌంట్లో 37 వేలు జమయ్యాయి. ఆ తర్వాత మరో మూడు నెలలకు ఏకంగా రూ.5 లక్షలు జమయ్యాయి. ఈ విధంగా ఒక రోజు కూలీ యూట్యూబ్ ద్వారా లక్షల్లో సంపాదిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.