Meals : మన పురాణాల్లో ఎన్నో విషయాల గురించి చెప్పబడింది. వాటిని ఇప్పటికీ చాలా మంది పాటిస్తున్నారు. పూర్వకాలం నుండి పెద్దలు పాటిస్తున్న ఆచారాలను కూడా చాలా మంది ఇంకా ఇళ్లల్లో పాటిస్తున్నారు. అయితే శాస్త్రాల ప్రకారం ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం ఇటువంటి ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది కాదు. తీసుకునే భోజనం సరిగా లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అంటే దేవుడితో సమానం. కనుక వృథా చేయకూడదు.
శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే భోజనం చేసే సమయంలో ఎవరూ కూడా భోజనం చేసే ప్లేట్ నుండి దాటకూడదు. పొరపాటున కూడా అలా దాటిన ఆహారాన్ని తినకూడదు. అలాంటి ఆహారాన్ని తీసుకుంటే పాపం చుట్టుకుంటుంది. బల్లి లేదా ఇతర కీటకాలు ఏమైనా ఆహార పదార్థాలలో పడితే అటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. శాస్త్రాల ప్రకారం దరిద్రం చుట్టుకుంటుంది. మనలో చాలామంది ఏదో ఒకసారి గొడవ పడుతూనే ఉంటారు. అయితే ఏదైనా గొడవ జరిగినప్పుడు భోజనం చేయాలని అనిపించదు. అలాంటప్పుడు భోజనం చేయకుండా ఉండటమే మంచిది.
అలాంటి సమయంలో భోజనం చేస్తే జీర్ణ క్రియ చెడిపోతుంది. తినేటప్పుడు ఎప్పుడు కూడా మనసుపెట్టి తినాలి. లేదంటే తినడం మానేయాలి. పాకశాస్త్రం ప్రకారం భోజనంలో వెంట్రుకలు కనుక వచ్చినట్లయితే ఇంట్లో రోగాలు ఎక్కువవుతాయి. అయితే అలా వెంట్రుకలు పడిన ఆహారాన్ని తీసుకోవడం కంటే కూడా జంతువులకు పెట్టడం మంచిది.
పొరపాటున ఎవరైనా తినే ఆహారంలో ఉమ్మివేసినా, ఉమ్మిపడినా ఆ భోజనం తినకూడదు. అలాంటి ఆహారం తింటే బలహీనత కలుగుతుంది. భోజనం చేసేటప్పుడు దగ్గరలో శునకాలు ఉంటే వాటికి భోజనం పెట్టాలి. అలా పెట్టకుండా ఆహారం మీరు తిన్నట్లయితే ఆయుష్షు తగ్గుతుంది. చూశారు కదా.. ఎలాంటి పొరపాట్లు చేయకూడదో. ఈసారి ఇలాంటి పొరపాట్లు చేయకుండా చూసుకోండి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…