Lakshmi Devi : కొంతమంది చేతుల్లో డబ్బు అసలు నిలవదు. చాలామంది విపరీతమైన ఖర్చు వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. డబ్బులని పొదుపుగా ఖర్చు చేయకుండా, డబ్బు అంతా ఖర్చు అయిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు. అయితే చేతిలో డబ్బులు నిలవాలంటే ఇలా చేయండి. ఇలా చేస్తే కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండవచ్చు.
లక్ష్మీదేవి గురించి వివిధ గాథలు పురాణాలలో, ఇతిహాసాలలో ఉన్నాయి. మహావిష్ణువుకి లక్ష్మీ తోడుగానే ఉందని, లక్ష్మీనారాయణలు వేరు వేరు కాదని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చెప్పడం జరిగింది. మహాశక్తి సృష్టిని పాలించడానికి, విష్ణువుకి తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని, దేవీ భాగవతంలో ఉంది. లక్ష్మీ, విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడు అయ్యాడని, అప్పుడు బ్రహ్మ ఆనతి పై భృగు మహర్షి తపస్సు చేయగా, లక్ష్మీ భృగువు ఖ్యాతిల కూతురుగా లక్ష్మీ పుట్టిందని అంటారు. భృగువు విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడు. అందుకని లక్ష్మిని భార్గవి అని అంటారు.
వేదాలలో కూడా లక్ష్మీదేవి గురించి చెప్పడం జరిగింది. యజుర్వేదంలో, మత్స్య పురాణంలో, అగ్ని పురాణంలో కూడా అమ్మవారు గురించి ఉంది. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి ఏం చేయాలి అనే విషయాన్ని చూస్తే.. పూజ గదిలో నేతితో దీపారాధన చేసి, అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా పెట్టి, తొమ్మిది శుక్రవారములు ఇలా లక్ష్మీదేవిని ఆరాధిస్తే, చాలా మంచి జరుగుతుందట. మహాలక్ష్మి దేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది. శుక్రవారం సాయంత్రం మహాలక్ష్మి దేవికి ఉసిరికాయ దీపాలని వెలిగిస్తే, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనకధార స్తోత్రం పఠించిన తర్వాత, ఉసిరికాయ బొబ్బట్లు లేదా గుజ్జును మహాలక్ష్మి దేవికి నైవేద్యం పెడితే, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు.
ఉసిరి దీపంతో మహాలక్ష్మి దేవికి హారతి ఇస్తే, దరిద్రం పోతుంది. ఉసిరికాయ దీపాన్ని మహాలక్ష్మి దేవికి పెట్టడం వలన అప్పుల బాధ నుండి బయటపడొచ్చు. ఉసిరి గుజ్జు, ఉసిరికాయ పచ్చడి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి, తర్వాత ముత్తైదువులకి వాయనం ఇస్తే, మొండి బకాయిలు వసూలు అవుతాయి. శ్రీ చక్రానికి ఉసిరికాయని నైవేద్యంగా పెడితే, సిరిసంపదలు కలుగుతాయి. ఉసిరి చెట్టుకి ప్రతిరోజు పూజ చేసి నీళ్లు పోసి నమస్కరించుకుంటే, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఉసిరికాయని కాలితో తొక్కితే దరిద్రం అనుభవిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…