సాధారణంగా మన హిందూ పురాణాల ప్రకారం దశావతారాలు అంటే మనకు శ్రీ విష్ణుమూర్తి ఎత్తిన దశావతారాలు గుర్తుకువస్తాయి. ఇదివరకు మనం పురాణాలలో విష్ణుమూర్తి దశావతారాల గురించి తెలుసుకున్నాము. లోకకల్యాణార్థం ఒక్కో యుగంలో ఒక్కో అవతారమెత్తి పాపాన్ని సంహరించి ధర్మాన్ని కాపాడారు. అయితే కేవలం విష్ణుమూర్తి మాత్రమే కాకుండా శివపార్వతులు సైతం దశావతారాలు అనే విషయం మీకు తెలుసా? శివపార్వతుల దశావతారాలు గురించి బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే శివపార్వతులు ఎత్తిన ఆ దశావతారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
శివపార్వతులు జంటగా, దంపతులుగా అవతరించిన దశావతారాలు ఇవే..
* మొదటి అవతారం.. మహాకాలుడు-మహాకాళి.
* రెండవ అవతారం: తారకావతారము -తారక దేవి
* మూడవ అవతారం: బాల భువనేశ్వరుడు -బాల భువనేశ్వరీ దేవి
* నాలుగవ అవతారం: షోడశ విశ్వేశ్వరుడు -షోడశ విద్యేశ్వరి
* ఐదవ అవతారం: భైరవేశ్వరడు -భైరవి దేవి
* ఆరవ అవతారం: భిన్నమస్త — భిన్నమస్తకి
* ఏడవ అవతారం: ధూమవంతుడు — ధూమవతి
* ఎనిమిదవ అవతారం: బగళాముఖుడు — బగళాముఖి ఎనిమిదవ అవతారంలో పార్వతీదేవిన
బహానంద అనే పేరుతో కూడా పూజించేవారు.
* తొమ్మిదవ అవతారం: మాతంగుడు — మాతంగి
* పదవ అవతారం: కమలుడు — కమల
ఈ విధంగా శివపార్వతులు జంటగా లోకకల్యాణార్థం పది అవతారాలను ఎత్తి భక్తులకు దర్శనం కల్పించారు.