ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే చాలామంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెడుతూ నెలకు వేలల్లో లక్షల్లో డబ్బులను సంపాదిస్తున్నారు. ఈ విధంగా రోజు కూలి పనులకు వెళ్లే ఓ సాధారణ వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా సెలబ్రిటీగా మారిపోయాడు. ఎన్నో యూట్యూబ్ చానల్స్ ఉన్నప్పటికీ అందులోనూ వంటలకు ఎన్నో ఛానల్ లో ఉన్నప్పటికీ “విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ”కి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది.
విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ ద్వారా చేసే వంటకాలు కేవలం చూడటానికి మాత్రమే కాకుండా ఆ రుచిని ఆస్వాదించి చేసేలా. ఏకంగా వందల కిలోల కొద్దీ మాంసాహారాలను, వందల కొద్ది గుడ్లతో వివిధ రకాల వంటకాలను వివిధ ప్రదేశాలలో తయారుచేస్తూ ఎంతోమంది సబ్స్క్రైబర్లు దక్కించుకుంది.విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ కి ఏకంగా నలభై నాలుగు లక్షల మంది సబ్ స్కైబర్లు ఉన్నారు అంటే ఈ ఛానల్ కు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అర్థమవుతుంది.
విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ ద్వారా 65 సంవత్సరాలు ఆర్ముగం అనే వ్యక్తి చేసే వంటకాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇతను తయారు చేసే వంటలకు కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిమానులు ఉన్నారు.ఒకేసారి 2500 కోడిగుడ్లతో పులుసు, 250 బాతుగుడ్లతో వేపుడు, వెయ్యి కోడి గుండెలతో గ్రేవీ కర్రీ, రెండడుగుల వ్యాసం కలిగిన ఆమ్లెట్… ఇలా డాడీ ఆర్ముగం వంటలన్నీ భారీగా తయారుచేయడం ఈ ఛానల్ ప్రత్యేకత.
ఒకప్పుడు రోజు కూలీ కోసం పనిచేసుకునే ఇతను తన కొడుకు సహాయంతో ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది సబ్స్క్రైబర్లు సంపాదించుకొని నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన నెలలో 7000 సంపాదించగా, తరువాత నెలలో 40000, ఆ తర్వాత ఏకంగా మూడు లక్షల ఆదాయాన్ని పొందారు. ఒకప్పుడు ఉండటానికి కూడా సొంత ఇల్లు లేని ఆర్ముగం ప్రస్తుతం 50 లక్షల రూపాయల ఇంటిలో నివసిస్తున్నాడు. అదేవిధంగా మదురైలో రెండు హోటళ్లను నిర్వహిస్తూ,స్కార్పియో, నిసాన్ సన్నీ వాహనాలకూ యజమాని అయ్యాడు.విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేయడమే కాకుండా అంత పెద్ద మొత్తంలో తయారు చేసిన ఆహార పదార్థాలను దగ్గరలో ఉన్న అనాధాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు పంపించడం ఈ ఛానల్ ప్రత్యేకత. ఏది ఏమైనా అతి తక్కువ సమయంలోనే ఇంతలా సంపాదించడం అంటే ఎంతో గ్రేట్ అని చెప్పవచ్చు.