బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన తరువాత అతనికి ఫ్రెండ్ చక్రవర్తి ఎన్నో సమస్యలలో ఇరుక్కున్నారు.సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా బయటకు వచ్చింది.ఈ క్రమంలోనే ఎంతోమంది సినీతారలను డ్రగ్ కేసులో అరెస్టు చేసి విచారణ జరిపారు. ఇందులో భాగంగానే హీరో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కోవడంతో ఈమె పై పోలీసులు కేసు నమోదు చేసి కొన్ని రోజుల పాటు రిమాండ్ కు తరలించారు.
ఈ క్రమంలోనే జైలు నుంచి బయటకు వచ్చిన రియా చక్రవర్తి సినిమా అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా తెలుగులో కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈమెకు ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 15 కోసం కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ జరుగుతుందనే విషయం తెలుసుకున్న ఈమె పలువురినీ సంప్రదించి బిగ్ బాస్ లో అవకాశం పొందినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లడం ద్వారా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తనపై వచ్చిన అబాండాలు అన్ని తొలగించుకోవడానికి మంచి వేదికగా ఉపయోగపడుతుందని రియా భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొనడానికి ఈ హీరోయిన్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ సీజన్ 15 కు హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.