కొందరు మనుషుల్లో రోజు రోజుకీ క్రూరత్వం పెరిగిపోతుందని చెప్పేందుకు ఈ సంఘటనే ఉదాహరణ. కేరళలో అత్యంత అమానుషమైన, దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మూగజీవాల పట్ల ఇద్దరు మహిళలు రాక్షసంగా ప్రవర్తించారు. ఓ తల్లి కుక్కతోపాటు నెల రోజుల వయస్సు ఉన్న దాని పిల్లలకు ఇద్దరు మహిళలు నిప్పు పెట్టారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేరళలోని ఎర్నాకులం జిల్లా అలంగద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మంజలి అనే చిన్న గ్రామంలో నివాసం ఉంటున్న మేరీ, లక్ష్మీ అనే ఇద్దరు మహిళలు ఓ తల్లి కుక్కతోపాటు నెల రోజు వయస్సు ఉన్న దాని 7 పిల్లలకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
https://youtu.be/n-t-Q25E7V8
అయితే రెండు కుక్క పిల్లలు తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయాయి. తల్లి కుక్క, ఇంకో 5 పిల్లలు బతికాయి. అవి అక్కడి నుంచి పారిపోగా ఓ మహిళ వాటిని గమనించి జంతు సంరక్షణ సిబ్బందికి సమాచారం అందజేసింది. దీంతో వారు ఆ కుక్కలను చేర దీశారు. వాటికి చికిత్స అందిస్తున్నారు.
కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుక్కల పట్ల ఈ విధంగా అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఆ ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.