మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పి ఓ తమ్ముడు తన అక్కను అతి దారుణంగా, కిరాతకంగా హత్య చేశాడు. చిత్రమేమిటంటే.. ఇందుకు వారి తల్లి కూడా ప్రోత్సహించింది. ఆమె, అతను కలిసి ఆ యువతిని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉన్న వైజాపూర్ తహసీల్ గోయ్‌గావ్ అనే గ్రామానికి చెందిన కీర్తి థోరె (19) అనే యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ వారు ఒప్పుకోలేదు. దీంతో వారు ఇళ్ల నుంచి బయటికి వచ్చి పెళ్లి చేసుకుని సొంతంగా జీవిస్తున్నారు.
అయితే కీర్తి థోరె తమ్ముడు (17), తల్లి ఇద్దరూ కలిసి మరాఠీ మూవీ సైరట్‌ను చూసి ప్రేరణ పొందారు. అందులో హీరోయిన్‌కు నచ్చజెప్పి ఆమె కుటుంబ సభ్యులు ఆమె ఉన్న చోటుకు వెళ్తారు. చివరకు ఆమెను అతి దారుణంగా నరికి చంపుతారు. సినిమాల్లో చివరి సీన్ అదే. దీంతో కీర్తి థోరె తమ్ముడు, తల్లి కూడా ఆ సీన్‌ను ప్రేరణగా తీసుకున్నారు. కీర్తిని చంపాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగానే ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కీర్తి ఇంటికి వెళ్లి ఆమెకు నచ్చజెప్పారు. ఆమె పెళ్లిని తాము ఆమోదిస్తున్నామని, గతంలో జరిగినవన్నీ మరిచిపోయి అందరం సంతోషంగా ఉందామని నమ్మబలికారు. దీంతో ఆమె నిజమేనని నమ్మింది. తరువాత టీ పెట్టి తెస్తానని చెప్పి ఇంట్లో కిచెన్‌లోకి వెళ్లింది. అయితే ఆమె తమ్ముడు ఇంటి డోర్ పెట్టి కిచెన్‌లో ఆమె వెనుకగా వెళ్లాడు.
ఈ క్రమంలోనే కీర్తి కాళ్లను పట్టుకున్న ఆమె తల్లి ఆమెను వెనక్కి లాగి కింద పడేసింది. ఆపై కీర్తిని అదిమిపట్టుకుంది. దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో తమ్ముడు ఆమె తలను నరికి వేరు చేశాడు. అనంతరం ఆమె తలతో ఇద్దరూ సెల్ఫీలు సైతం దిగారు. చుట్టు పక్కల ఉన్నవారికి ఆ తలను చూపించారు. అయితే అదే సమయానికి కీర్తి భర్త వచ్చాడు. కీర్తి తమ్ముడు అతన్ని కూడా చంపబోయాడు. కానీ అతను తప్పించుకున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా వారు సైరట్ సినిమాను చూసి ప్రేరణ పొంది ఆ హత్య చేసినట్లు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…