Samantha : టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య – సమంత అక్టోబర్ 2న తమ విడాకుల విషయాన్ని అఫిషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6న వీరి 4వ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటారని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఇకపై ఈమె అక్కినేని కోడలు కాదనే విషయం చైతన్యతోపాటు నాగ్ కూడా ప్రకటించారు. దయచేసి తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని.. కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు, శ్రేయోభిలాషులు తమ నిర్ణయంపై ప్రైవసీ పాటించాలని కోరింది.
అక్కినేని నాగ చైతన్యతో డైవోర్స్ అనంతరం సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. అమ్మ చెప్పిందంటూ పలు విషయాలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. అయితే డైవోర్స్ విషయంలో అదే సోషల్ మీడియాలో నెటిజన్లు సమంతదే తప్పు అన్నట్టుగా విపరీతమైన ట్రోల్స్ చేశారు. కానీ ఇన్నాళ్లూ వాటిపై స్పందించలేదు. తనపని తాను చేసుకుంటూ ముందుకు సాగింది.
తాజాగా ఓ ప్రఖ్యాత మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల గురించి.. తనపై వచ్చిన ట్రోలింగ్ గురించి స్పందించింది. విడాకులపై ముందుగా తన మాటలతో అందరూ అంగీకరిస్తారని అనుకోవడం లేదని చెప్పేసిన సమంత.. అందరూ తన కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలని డిమాండ్ చేయనని.. ఎవరికి వారికి వారి అభిప్రాయాలు ఉండకూడదని కూడా తాను అనుకోనని.. కానీ మనం చేసే పని ఆమోదయోగ్యంగా ఉండాలని గుర్తు పెట్టుకోవాలని చెప్పింది. అసలు విడాకుల వెనుక కారణాలను మాత్రం వెల్లడించేందుకు సమంత ఇష్టపడలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…