పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల పాటు విరామం తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైన.ప్రేక్షకులకు అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. థియేటర్లలో విడుదల అయిన కొద్ది రోజులకే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అయింది.
చాలా విరామం తర్వాత రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. తర్వాతపవన్ కళ్యాణ్ హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేయడమే కాకుండా బండ్ల గణేష్ నిర్మాణంలో మరో సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మరొక దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఖిలాడి చిత్ర దర్శకుడు రమేష్ వర్మ పవన్ కళ్యాణ్ కు కథ చెప్పడంలో, ఆ కథ నచ్చడంతో పవన్ కళ్యాణ్ అతని దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ ,హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలు పూర్తి కాగానే రమేష్ వర్మ సినిమాలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.