ప్రస్తుతం కాలంలో మన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు అవసరం. ఏమాత్రం అజాగ్రత్తగా వహించిన ఎన్నో సమస్యలను కొని తెచ్చుకోవడం కాయం. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో కొద్దిగా జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన అది కరోనా ఏమోనని చాలామంది భయపడుతుంటారు.అయితే దగ్గు, జలుబు చేసినప్పుడు ఏ మాత్రం భయపడకుండా కొన్ని నివారణ పద్ధతులను పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. మరి ఆ నివారణ మార్గాలు ఏమిటో తెలుసుకుందాం..
మీకు ఒంట్లో వేడిగా ఉన్నా దగ్గు, జలుబు చేసినా ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి ఏడు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత నీటిలోకి ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకుని తాగటం వల్ల వంట్లో వేడి, దగ్గు జలుబు నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా కష్టమని భావిస్తే ఈ సమస్యలతో బాధపడేవారు ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను, అల్లం ముక్కలను నమిలి మింగడం ద్వారా తొందరగా ఉపశమనం పొందవచ్చు.
కొందరికి జలుబు దగ్గుతో పాటు గొంతులో గరగర అనే సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఏర్పడినప్పుడు ఏమాత్రం భయపడకుండా ఒక టేబుల్ టీ స్పూన్ అల్లంరసం, ఒక టేబుల్ టీ స్పూన్ తేనె, ఒక టేబుల్ టి స్పూన్ నిమ్మరసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల గొంతు గరగర సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.ప్రతి రోజు రాత్రి గోరు వెచ్చని పాలలోకి కాస్త పసుపు కలుపుకుని తాగడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.