పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ తరువాత తన సినిమాలన్ని పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం రాదే శ్యామ్, సలార్, ఆది పురుష్ వంటి సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ప్రభాస్ కు మరొక క్రేజీ ఆఫర్ వచ్చిందని సమాచారం ఇవ్వబడుతుంది.
అయితే ప్రభాస్ తొలిసారిగా ఒక మహిళ దర్శకురాలితో పని చేయనున్నట్లు తెలుస్తోంది. గురు,ఆకాశమే నీ హద్దురా వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకురాలు సుధ కొంగర ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ని కలిసి స్టోరీలైన్ చెప్పినట్లు తెలుస్తోంది.ప్రభాస్ కూడా ఇందుకు సానుకూలంగా వ్యవహరించడంతో ఈమె దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
సుధా కొంగర దర్శకత్వంలో ప్రభాస్ తో బయోపిక్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. భారత దేశంలో అత్యంత ప్రభావశీల వ్యక్తి జీవితాన్ని ప్రభాస్ తో తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడిందని చిత్ర బృందం తెలిపింది.