సాధారణంగా బెండ కాయలు గ్రీన్ కలర్ లో ఉంటాయి. కానీ మనకు మార్కెట్‌లో ప్రస్తుతం ఎరుపు రంగులో ఉండే బెండకాయలు కూడా లభిస్తున్నాయి. వీటిని చాలా మంది రైతులు ప్రస్తుతం సాగు చేస్తున్నారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకనే వీటిని తినేందుకు జనాలు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజల అభిరుచులకు అనుగుణంగా రైతులు కూడా వీటిని పండించడానికే మొగ్గు చూపిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా ఖాజూరి కలన్ అనే ప్రాంతానికి చెందిన మిస్రిలాల్ రాజ్‌పూత్ ఎరుపు రంగు బెండకాయలను సాగు చేస్తున్నాడు. వారణాసిలో ఉన్న అగ్రికల్చరల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ నుంచి ఎరుపు రంగు బెండ విత్తనాలను 1 కిలో తెచ్చానని వాటిని జూలై మొదటి వారంలో నాటగా 40 రోజుల్లో పెరగడం ప్రారంభించాయని తెలిపాడు.
ఎరుపు రంగు బెండకాయలను పండించేందుకు ఎలాంటి కృత్రిమ ఎరువులు, రసాయనాలను వాడలేదని, పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేశానని తెలిపాడు. ఈ క్రమంలో పంట బాగా వచ్చిందని అన్నాడు. ఒక ఎకరాల స్థలంలో కనీసం 40-50 క్వింటాళ్ల నుంచి గరిష్టంగా 70-80 క్వింటాళ్ల వరకు ఎరుపు రంగు బెండకాయలను పండించవచ్చని తెలిపాడు.
మార్కెట్‌లో ప్రస్తుతం ఎరుపు రంగు బెండకాయలను మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే సాధారణ బెండ కాయలకన్నా ఎరుపు రంగు బెండకాయల రేటు 5-7 రెట్లు ఎక్కువగా ఉంది. ఎరుపు రంగు బెండకాయలు కిలోకు రూ.700 నుంచి రూ.1200 వరకు ధర పలుకుతున్నట్లు ఆ రైతు తెలిపాడు. వీటి వల్ల లాభాలు బాగా వస్తున్నట్లు వివరించాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…